AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఏకంగా నలుగురి చేతులు మారిన చిన్నారి.. అసలు ట్విస్ట్ తెలిస్తే..

పిల్లలు కావట్లేదని.. ఎన్నో జంటలు గుడులు, హాస్పిటల్స్ చూట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ ఇక్కడో జంట మాత్రం.. లగ్జరీలైఫ్‌ కోసం నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన బిడ్డను నెల గడవక ముందే అమ్మకానికి పెట్టారు. ఇలా తల్లి నుంచి మధ్యవర్తికి చేరిన ఆ పసికందూ.. ఏకంగా నాలుగు చేతులు మారి.. చివరకు పోలీసుల జోక్యంతో రక్షించబడింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీనగర్‌లో వెలుగు చూసింది.

సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఏకంగా నలుగురి చేతులు మారిన చిన్నారి.. అసలు ట్విస్ట్ తెలిస్తే..
Child Trafficking Maharashtra
Anand T
|

Updated on: Sep 29, 2026 | 10:39 PM

Share

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాతృత్వానికే మచ్చ తెచ్చలా ప్రవర్తించింది ఓ తల్లి.. లగ్జరీ లైఫ్ లీడ్ చేసేందుకు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసు కొనుగోలు చేయడం కోసం పుట్టిన నెలరోజులకే కన్నబిడ్డను రూ.1.20లక్షలు అమ్ముకున్నారో కసాయి తల్లిదండ్రులు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా.. కేవలం జల్సాల కోసమే వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు.. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమింటంటే.. తల్లిదండ్రుల నుంచి మధ్యవర్తికి చేరిన ఆ చిన్నారి ఏకంగా నాలుగుసార్లు చేతులు మారి చివరకు హైదరాబాద్‌లో పోలీసుల చెంతకు సురక్షితంగా చేరింది. ఈ వ్యవహారంలో తల్లిదండ్రులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ముకుంద్‌వాడి ప్రాంతంలో సహజీవనం చేస్తున్న ఓ జంట ఇటీవలే ఓ బిడ్డకు జన్మ నిచ్చారు. అయితే సెప్టెంబర్ 20వ తేదీన తనను ఎవరో కొట్టారంటూ ఆ చిన్నారి తల్లి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్‌యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. ఆ తల్లి, తన ప్రియుడితో కలిసి తనకు పుట్టిన నెల వయసున్న మగబిడ్డను సీమా రేష్వాల్ అనే ఏజెంట్‌కు రూ.1.2 లక్షలకు విక్రయించినట్టు గుర్తించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే తొలుత బిడ్డను కొనుగోలు చేసిన ఏజెంట్ ఆ బిడ్డను పడేగావ్‌కు చెందిన సంగీత అవ్హాద్ అనే మరో మహిళకు రూ.2.7 లక్షలకు అమ్మేసినట్టు గుర్తించారు. అయితే వాళ్ల దగ్గర కూడా ఆ బిడ్డ దొరకలేదు.. ఎందుకంటే వారు కూడా ఆ శిశువును ఫేక్ వైద్యుడికి రూ.3.5 లక్షలకు విక్రయించినట్టు తెలిపారు. అయితే ఆ వైద్యుడు కూడా బిడ్డను హైదరాబాద్‌లో ఉంటున్న మరో ఫ్యామిలీకి రూ.3.7లక్షలకు అప్పగించాడు.

దీంతో బిడ్డ చివరగా హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శిశువును సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం చిన్నారిని తిరిగి మహారాష్ట్రకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్న పోలీసులు..ఈ ముఠాపై ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో చిన్నారి తల్లిదండ్రులు, సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. అలాగే బిడ్డను అమ్మి ఆ పేరెంట్స్ కొన్ని రెండు ఖరీదైన ఫోన్స్‌, ఒ గోల్డ్‌ ఛైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us