AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దండారి పండుగ ప్రత్యేకత ఇదే.. తుడుం మోతలు, గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీ గూడాల్లో సందడి!

Dhandari Festival: గోండు, కొలాం ఆదివాసీల దండారి పండుగ రెండు వారాల పాటు వైభవంగా జరుగుతుంది. ఏత్మాసార్ పేన్‌ను కొలుస్తూ, గుస్సాడీ నృత్యాలు, ప్రత్యేక వస్త్రధారణతో ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. నెమలి ఈకల టోపీలు, సాంప్రదాయ వాయిద్యాలతో గూడాల్లో సందడి నెలకొంటుంది. ఇది కేవలం పండుగే కాదు, తరతరాల వారసత్వాన్ని భావితరాలకు అందించే వేదిక.

Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 12:26 PM

Share
ఆదివాసీ గూడాలు పండుగ శోభను సంతరించుకుంటున్నాయి. తుడుం మోతలు.. డప్పుల దరువులు.. గజ్జెల సవ్వడులతో పల్లెలన్నీ మారుమోగేందుకు సిద్ధమవుతున్నాయి. నెమలి ఈకలతో చేసిన అందమైన టోపీలు.. ఒంటినిండా బూడిద రంగు అలంకరణ.. చేతిలో దుడ్డుకర్ర.. కాలికి గజ్జెలు.. ఇలా గుస్సాడీల వేషధారణతో ఆదివాసీలు సంప్రదాయ వేడుకకు సిద్ధమవుతున్నారు. అదే.. గోండు, కొలాం ఆదివాసీల ఆరాధనకు, కళా వైభవానికి ప్రతీకగా నిలిచే దండారి పండుగ.

1 / 7

రెండు వారాల పాటు సందడే సందడి.. 
ఆశ్వాయుజ పౌర్ణమి.. దీపావళికి ముందు ప్రారంభమై కొలబొడితో ముగిసే ఆదివాసీల అతి పెద్ద పండుగ దండారి. ఆరాధ్య దైవమైన ఏత్మాసార్ పేన్‌ను కొలుస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం జరిగే ఈ ఉత్సవాల్లో భోగి, అకాడి వంటి ఘట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గిరిజన గూడాల్లో కుటుంబాలు, బంధుమిత్రులు ఒక్కచోట చేరి పండుగను సామూహికంగా జరుపుకుంటారు.

రెండు వారాల పాటు సందడే సందడి.. ఆశ్వాయుజ పౌర్ణమి.. దీపావళికి ముందు ప్రారంభమై కొలబొడితో ముగిసే ఆదివాసీల అతి పెద్ద పండుగ దండారి. ఆరాధ్య దైవమైన ఏత్మాసార్ పేన్‌ను కొలుస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం జరిగే ఈ ఉత్సవాల్లో భోగి, అకాడి వంటి ఘట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గిరిజన గూడాల్లో కుటుంబాలు, బంధుమిత్రులు ఒక్కచోట చేరి పండుగను సామూహికంగా జరుపుకుంటారు.

2 / 7

గుస్సాడీ వేషధారణే ప్రత్యేక ఆకర్షణ.. 
దండారి ఉత్సవాల్లో గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తలపై నెమలి ఈకలతో తయారుచేసిన టోపీ.. ముఖానికి సంప్రదాయ కవచాలు.. మెడలో రుద్రాక్షలు.. శరీరానికి బూడిద రంగు అలంకరణ.. చేతిలో దుడ్డుకర్రతో గుస్సాడీలు ప్రత్యేకంగా కనిపిస్తారు. కాలికి గజ్జెలు కట్టుకుని అడుగులు వేస్తూ చేసే నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గుమేల, పర్ర, పెట్టె వంటి సంప్రదాయ వాయిద్యాలను బయటకు తీసి అలంకరించి, పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

గుస్సాడీ వేషధారణే ప్రత్యేక ఆకర్షణ.. దండారి ఉత్సవాల్లో గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తలపై నెమలి ఈకలతో తయారుచేసిన టోపీ.. ముఖానికి సంప్రదాయ కవచాలు.. మెడలో రుద్రాక్షలు.. శరీరానికి బూడిద రంగు అలంకరణ.. చేతిలో దుడ్డుకర్రతో గుస్సాడీలు ప్రత్యేకంగా కనిపిస్తారు. కాలికి గజ్జెలు కట్టుకుని అడుగులు వేస్తూ చేసే నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గుమేల, పర్ర, పెట్టె వంటి సంప్రదాయ వాయిద్యాలను బయటకు తీసి అలంకరించి, పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

3 / 7

నెమలి ఈకల టోపీల తయారీలో నైపుణ్యం.. 
దండారి వేడుకలకు రెండు వారాల ముందుగానే ఆదివాసీలు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గూడాల్లో ఇళ్లను శుభ్రం చేసుకుని, సున్నాలు వేసి పండుగకు సిద్ధమవుతారు. గుస్సాడీ వేషధారణకు అవసరమైన టోపీల తయారీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. నెమలి ఈకలను వరుస క్రమంలో అమర్చి, ఎంతో నేర్పుతో టోపీలను రూపొందిస్తారు. డప్పులకు మెరుగులు దిద్దుతూ, సంప్రదాయ వాయిద్యాలను సిద్ధం చేసుకుంటారు.

నెమలి ఈకల టోపీల తయారీలో నైపుణ్యం.. దండారి వేడుకలకు రెండు వారాల ముందుగానే ఆదివాసీలు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గూడాల్లో ఇళ్లను శుభ్రం చేసుకుని, సున్నాలు వేసి పండుగకు సిద్ధమవుతారు. గుస్సాడీ వేషధారణకు అవసరమైన టోపీల తయారీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. నెమలి ఈకలను వరుస క్రమంలో అమర్చి, ఎంతో నేర్పుతో టోపీలను రూపొందిస్తారు. డప్పులకు మెరుగులు దిద్దుతూ, సంప్రదాయ వాయిద్యాలను సిద్ధం చేసుకుంటారు.

4 / 7

దండారి అంటే కేవలం నృత్యాలకే పరిమితమైన పండుగ కాదు. గోండి పాటలు, కోలాటాలు, హాస్య ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో గూడాల్లో సందడి నెలకొంటుంది. తరతరాలుగా వస్తున్న ఆచారాలను యువతకు పరిచయం చేస్తూ.. తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే వేదికగా ఈ వేడుకలు నిలుస్తాయి. భక్తి, వినోదం, సామూహిక ఐక్యత కలగలిసిన దండారి ఆదివాసీ జీవనశైలికి అద్దం పడుతుంది.

5 / 7
దండారి వేడుకల్లో గుస్సాడీ నృత్యాలకు ప్రత్యేకత ఉంది. నెత్తిన నెమలి ఈకలతో టోపీలు.... చేతిలో మంత్ర దండం.... మెడలో రుద్రాక్ష మాలలు.... కాళ్ళకు, నడుముకు గజ్జెలు.... ముఖానికి విభూతి... నల్లటి, తెల్లటి చారలతో గీతలు... గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలు, భుజాన జంతువు చర్మం... ఇలా ప్రత్యేక ఆకర్షణగా కనబడతాయి గుస్సాడీ వేషాలు. కోరికలు నెరవేరాలని గూడెం యువకులు గుస్సాడి వేషాలు కడతారు. పది రోజులు నియమనిష్ఠలలో ఉండి...దండారి సంబురాల్లో పాల్గొంటారు గుస్సాడీలు. దీక్షతో ఉన్న వారం, పది రోజులు స్నానం చేయకుండా, కట్టిన బట్టలు విడవకుండా, నేలపైనే పడుకుంటూ.. దీక్షలు చేస్తుంటారు గుస్సాడీలు.

6 / 7
దండారి ఉత్సవాల్లో అకాడి రోజుకి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండుగలో మాత్రమే వాడే గుమేల, పర్ర, పెట్టె అనే వాయిద్యాలను బయటకు తీసి అలంకరిస్తారు. వాటితో పాటు టప్పల్, కోడల్ అనే ముఖానికి పెట్టుకునే కవచాలు, గుస్సాడీల కంకాలి టోపీలు, ఆభరణాలు, మంత్రదండం, మెడలో రుద్రాక్షలు, రోకళ్లతో సామూహికంగా పూజ చేసి.. వాయిద్యాలను మోగిస్తారు. వీటికి నైవేధ్యం సమర్పించడంతో దండారీ వేడుకలు మొదలవుతాయి. ఒక ఊరి దండారి బృందం రెండు, మూడు ఊళ్లకు వెళ్తుంది. తెల్లని ధోతులు, నడుముకు, తలకూ తెల్లని లేదా ఎరుపు, ఆకుపచ్చ రంగుల రుమాళ్ళు కట్టుకొని.. కోలలు పట్టుకొని నృత్యాలు చేస్తారు. 
తుడుం మోతతో మొదలై.. గుస్సాడీల నృత్యాలతో ఉత్సాహాన్ని నింపుతూ.. కొలబొడితో ముగిసే దండారి ఉత్సవాలు ఆదివాసీ గూడాల్లో కొత్త కళను తీసుకొస్తాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం.. ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించే సజీవ వారసత్వంగా నిలుస్తోంది.

దండారి ఉత్సవాల్లో అకాడి రోజుకి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండుగలో మాత్రమే వాడే గుమేల, పర్ర, పెట్టె అనే వాయిద్యాలను బయటకు తీసి అలంకరిస్తారు. వాటితో పాటు టప్పల్, కోడల్ అనే ముఖానికి పెట్టుకునే కవచాలు, గుస్సాడీల కంకాలి టోపీలు, ఆభరణాలు, మంత్రదండం, మెడలో రుద్రాక్షలు, రోకళ్లతో సామూహికంగా పూజ చేసి.. వాయిద్యాలను మోగిస్తారు. వీటికి నైవేధ్యం సమర్పించడంతో దండారీ వేడుకలు మొదలవుతాయి. ఒక ఊరి దండారి బృందం రెండు, మూడు ఊళ్లకు వెళ్తుంది. తెల్లని ధోతులు, నడుముకు, తలకూ తెల్లని లేదా ఎరుపు, ఆకుపచ్చ రంగుల రుమాళ్ళు కట్టుకొని.. కోలలు పట్టుకొని నృత్యాలు చేస్తారు. తుడుం మోతతో మొదలై.. గుస్సాడీల నృత్యాలతో ఉత్సాహాన్ని నింపుతూ.. కొలబొడితో ముగిసే దండారి ఉత్సవాలు ఆదివాసీ గూడాల్లో కొత్త కళను తీసుకొస్తాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం.. ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించే సజీవ వారసత్వంగా నిలుస్తోంది.

7 / 7
Follow Us