AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కా పల్లెటూరి స్టైల్ నాటుకోడి ఇగురు.. మసాలాలతో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

నాటుకోడి ఇగురు అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా పల్లెటూరి స్టైల్‌లో తయారు చేసే నాటుకోడి ఇగురు రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వంటకాన్ని చాలా మంది కుక్కర్‌లో వండుతుంటారు, అయితే లేత నాటుకోడిని కుక్కర్ లేకుండా, నెమ్మదిగా వండితే ఆ రుచి అసలైన అనుభూతిని ఇస్తుంది. ఈ వంటకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 12:16 PM

Share
కావాల్సిన పదార్థాలు:  ఒక కిలో నాటుకోడి, నూనె - 150 గ్రాములు, ఉల్లిపాయలు - 2 పెద్దవి , దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు, 
యాలకులు - 3, లవంగాలు - 5, బిర్యానీ ఆకు - 2,  పసుపు - చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - 1 టేబుల్ స్పూన్ ( రుచికి సరిపడా), కారం - 1.5 టేబుల్ స్పూన్లు ( రుచికి సరిపడా), టమాటాలు - 3 మీడియం సైజు (సన్నగా తరిగినవి),  జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్,  పచ్చిమిరపకాయలు - 4 , కొత్తిమీర - సగం కట్ట (సన్నగా తరిగినది), నీళ్లు - 1 గ్లాసు
గరం మసాలా - అర టేబుల్ స్పూన్, నిమ్మకాయను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: ఒక కిలో నాటుకోడి, నూనె - 150 గ్రాములు, ఉల్లిపాయలు - 2 పెద్దవి , దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు, యాలకులు - 3, లవంగాలు - 5, బిర్యానీ ఆకు - 2, పసుపు - చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - 1 టేబుల్ స్పూన్ ( రుచికి సరిపడా), కారం - 1.5 టేబుల్ స్పూన్లు ( రుచికి సరిపడా), టమాటాలు - 3 మీడియం సైజు (సన్నగా తరిగినవి), జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు - 4 , కొత్తిమీర - సగం కట్ట (సన్నగా తరిగినది), నీళ్లు - 1 గ్లాసు గరం మసాలా - అర టేబుల్ స్పూన్, నిమ్మకాయను తీసుకోవాలి.

1 / 5
ముందుగా, ఒక మందపాటి కడాయి బాణలిని స్టవ్‌పై పెట్టి, నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయాలి. ఉల్లిపాయలు వేయగానే, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులను కూడా వేసి, ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.

2 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసి బాగా కలపాలి. మీరు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టేలా చూసుకోవాలి.

3 / 5
నీరు అసలు పోయకుండా, నూనెలోనే కోడి ముక్కలను బాగా వేయించాలి. మూత పెట్టి, సుమారు 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ, 15-20 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేస్తే  కోడి ముక్కలు నూనెలోనే ఉడుకుతాయి. ఇది కోడికి అద్భుతమైన రుచిని ఇస్తుంది.
కోడి ముక్కలు సగం ఉడికిన తర్వాత, సన్నగా తరిగిన టమాటాలను చేర్చాలి. టమాటాలను ఎప్పుడూ ముందు వేయకూడదు, ఎందుకంటే పులుపు పదార్థాలు మాంసాన్ని గట్టిపడేలా చేస్తాయి. టమాటాలు వేసి బాగా కలిపి, అవి మెత్తబడే వరకు వేయించాలి.
ఇప్పుడు మరో అర టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, సగం కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

నీరు అసలు పోయకుండా, నూనెలోనే కోడి ముక్కలను బాగా వేయించాలి. మూత పెట్టి, సుమారు 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ, 15-20 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేస్తే కోడి ముక్కలు నూనెలోనే ఉడుకుతాయి. ఇది కోడికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. కోడి ముక్కలు సగం ఉడికిన తర్వాత, సన్నగా తరిగిన టమాటాలను చేర్చాలి. టమాటాలను ఎప్పుడూ ముందు వేయకూడదు, ఎందుకంటే పులుపు పదార్థాలు మాంసాన్ని గట్టిపడేలా చేస్తాయి. టమాటాలు వేసి బాగా కలిపి, అవి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు మరో అర టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, సగం కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

4 / 5
ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి, రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకోవాలి. ఈ దశలో ఉప్పు సరిచూసుకుంటే, కోడి ముక్కలకు, గ్రేవీకి ఉప్పు, కారం బాగా పడతాయి. మూత పెట్టి, ఇంకో 15-20 నిమిషాల పాటు లేదా కోడి ముక్కలు పూర్తిగా మెత్తబడే వరకు తక్కువ మంటపై ఉడికించాలి. కోడి రకాన్ని బట్టి ఉడికే సమయం మారవచ్చు. కోడి ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మకాయ రసం, మిగిలిన కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. గరం మసాలా సువాసన ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపివేసి, వేడి వేడి పల్లెటూరి స్టైల్ నాటుకోడి ఇగురును అన్నంతో  కలిపి తీసుకుంటే మంచిది. ఈ విధానంలో వండిన నాటుకోడి ఇగురు పక్కా పల్లెటూరి రుచిని అందిస్తుంది.

5 / 5
Follow Us