ఉల్లిపాయలు వేగిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా క్రంచీగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ సోయా సాస్, రెండు టీ స్పూన్ల టమాటో సాస్, ఒక టీ స్పూన్ వెనిగర్, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, పావు టీ స్పూన్ పంచదార వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక, ముందుగా మనం నీటిలో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి, ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో మరగనివ్వాలి. గ్రేవీ చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. సాస్ ఉడికిన తర్వాత సాస్‌కు తగినంత ఉప్పు ముందుగా మనం వేయించుకున్న క్యాబేజీ బాల్స్‌ను వేసుకొని, మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు సాస్ బాల్స్‌కు పట్టేలా బాగా కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే, చాలా టేస్టీగా, స్ట్రీట్ స్టైల్ రుచితో ఉండే వెజ్ మంచూరియా రెడీ