AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా స్టైల్ గోంగూర పులావ్.. పుల్లపుల్లని రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

ఆంధ్ర స్టైల్ గోంగూర పులావ్ అనేది రుచికరమైన వంటకం. ఇది లంచ్ బాక్సులకు, అలాగే పని చేసే మహిళలకు చాలా అనుకూలమైన రెసిపీ. ఈ పులావ్ వండడానికి బాస్మతి రైస్ కాకుండా మనం ఇంట్లో వండుకునే సాధారణ బియ్యాన్నే ఉపయోగించవచ్చు. ఎలా తయారు చేయాలంటే?

Prasanna Yadla
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 8:40 AM

Share
ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోండి. వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టండి.పులావ్ వండడానికి కుక్కర్‌ను తీసుకోండి. లంచ్ బాక్స్‌ల కోసమైనా ఇంకా ఇది త్వరగా చేసుకోవాలన్నా కుక్కర్‌లో చేయడం సులభం. రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగితేనే పులావ్‌కు మంచి రుచి వస్తుంది.

1 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత, రెండు బిర్యానీ ఆకులు, రెండు స్టార్ ఎనైస్, కొద్దిగా జాపత్రి, కొంచెం బగార పువ్వు, చిన్న దాల్చిన చెక్క, రెండు యాలకులు, రెండు మూడు లవంగాలు, పది-పన్నెండు జీడిపప్పు పలుకులు, ఒక టీ స్పూన్ షాజీరా వేసి కొద్దిసేపు వేయించండి. షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, లేనివారు జీలకర్రను వాడవచ్చు.

2 / 5
ఇవి కొంచెం వేగిన తర్వాత, నాలుగైదు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ తాజాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో ఒకటి రెండు నిమిషాలు వేయించాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒకటి కట్ చేసిన టమాటా ముక్కలు వేసి, టమాటా మెత్తబడే వరకు రెండు నిమిషాలు వేయించాలి.

3 / 5
ఇవన్నీ బాగా వేగి, టమాటా మెత్తబడిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపు, ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు శుభ్రం చేసిన రెండు కప్పుల ఎర్ర గోంగూర ఆకును వేసి రెండు మూడు నిమిషాలు బాగా వేయించండి. గోంగూర వేగిన తర్వాత, నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా తీసి వేయాలి. బియ్యం తడి పూర్తిగా పోయి, కొంచెం పొడిబారేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ రెండు నిమిషాలు వేయించండి.బియ్యం బాగా వేగిన తర్వాత, ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోయండి. ఇక్కడ మనం సాధారణ బియ్యం వాడాం కాబట్టి ఈ మోతాదు సరిపోతుంది. ఒకవేళ మీరు బాస్మతి బియ్యం వాడుతుంటే ఒక గ్లాసుకు ఒకటింపావు గ్లాసు నీళ్లు సరిపోతుంది. గిన్నెలో వండుతున్నట్లయితే సాధారణ బియ్యానికి ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్లు అవసరం.

4 / 5
నీళ్లు పోసిన తర్వాత కొంచెం పుదీనా ఆకు, పిడికెడంత కొత్తిమీర ఆకు వేసి ఒకసారి కలిపి, ఉప్పు రుచి చూడండి. అవసరమైతే ఉప్పు సరిచేసుకోండి.కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్‌లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి, విజిల్ లోని గాలంతా పోయాక మూత తీయాలి.మూత తీసిన తర్వాత, కిందినుండి పైకి ఒకసారి బాగా కలిపి, వేడి వేడిగా సర్వ్ చేయండి. ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండానే, పక్కన కొంచెం ఉల్లిపాయలతో తినవచ్చు. పిల్లలకైతే పెరుగు రైతాతో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. తింటే మళ్లీ మళ్లీ

ఆంధ్రా స్టైల్ గోంగూర పులావ్.. పుల్లపుల్లని రుచితో ఇంట్లోనే ఈజీగా

రికార్డ్ టైమింగ్‎తో దుమ్ములేపిన తెలుగమ్మాయి

రావణుడి పది తలలు దేనికి సంకేతం? ఆ 10 దుర్గుణాలు ఏమిటో తెలుసా?

క్రేజీ కాంబినేషన్.. ఆ సౌత్ డైరెక్టర్ తో హృతిక్ రోషన్ సినిమా..

కాబోయే భార్యతో కలిసి బతుకమ్మ సంబరాల్లో డైరెక్టర్ డేగల బాబు

ఉప్పల్‌–నాగోల్‌ రోడ్డులో కారు బీభత్సం.. ఫౌంటెన్‌లా ఎగసిపడ్డ నీరు

18 ఏళ్లు నిండాక పాన్ కార్డులో ఫొటో, సంతకం అప్డేట్ చేేసుకోవడం ఎలా

భువీ స్వింగ్‌కు కివీస్ బ్యాటర్లు దొరుకుతారా.. లేక పాత కథేనా?

దసరా తర్వాత.. వీరికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?