AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు!

మన ఇళ్లలో తరచుగా పచ్చి కొబ్బరి మిగిలిపోవడం చూస్తుంటాం. దాన్ని ఏం చేయాలో తెలియక చాలామంది పక్కన పెట్టేస్తుంటారు. అయితే , కేవలం ఐదు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి జున్నును ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీ ఎంత ఈజీ అంటే పిల్లలు కూడా చిటికెలో చేసేయగలరు.

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 8:39 AM

Share
కావాల్సిన పదార్థాలు:  పచ్చి కొబ్బరి ముక్కలు: 2 కప్పులు , రెండు కప్పుల నీళ్లు,  చక్కెర: అర కప్పు, మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్): 4 టేబుల్ స్పూన్లు,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.  కొబ్బరిని సిద్ధం చేసుకోవాలి: ముందుగా, పచ్చి కొబ్బరిని తీసుకుని, దాని మీదున్న గోధుమ రంగు పై భాగాన్ని పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక కప్పుతో కొలిచి రెడీ చేసుకోవాలి. ఒక పెద్ద కొబ్బరికాయ నుండి 2 కప్పుల ముక్కలు వస్తాయి.

1 / 5

ఇంకా కట్ చేసిన కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి, ఇంకా దీనిలో ముందుగా నీళ్లు కలపకుండా వీటిని ఒక్కసారిగా  గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వలన కొబ్బరి చక్కగా నలుగుతుంది. ఆ తర్వాత, రెండు కప్పుల కొబ్బరి ముక్కలకు రెండు కప్పుల నీళ్లు వేసి, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ముందుగానే ఎక్కువ నీళ్లు వేస్తే కొబ్బరి సరిగ్గా నలగదు కాబట్టి, దీనిని పాటించడం మంచిది.

2 / 5
గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని ఒక జల్లెడ లేదా పలుచని వస్త్రం సాయంతో వడకట్టి కొబ్బరి పాలను సేకరించాలి. గట్టిగా నొక్కుతూ పాలను పూర్తిగా పిండి తీయాలి. ఇలా చేయడం వల్ల చిక్కని కొబ్బరి పాలు వస్తాయి. వడకట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి తురుమును పారవేయకుండా, బెల్లం కలిపి కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, లేదా కూరల్లో ఉపయోగించవచ్చు, లేదా డ్రై రోస్ట్ చేసి డెసికేటెడ్ కోకోనట్‌గా వాడుకోవచ్చు.సేకరించిన కొబ్బరి పాల నుండి కొద్దిగా పాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని, అందులో నాలుగు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని వేసి, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలను స్టవ్ పైన పెట్టి, అందులో అర కప్పు చక్కెరను కలపాలి. ఒకసారి కలిపిన తర్వాత, మంటను మధ్యస్థం నుండి తక్కువ స్థాయికి సర్దుబాటు చేసి, ముందుగా సిద్ధం చేసుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని వేసి నిరంతరం కలుపుతూ ఉడికించాలి. మొక్కజొన్న పిండి కలపడం వల్ల మిశ్రమం త్వరగా చిక్కబడుతుంది. దాదాపు 4-5 నిమిషాల్లో ఇది చిక్కగా మారుతుంది. ఈ సమయంలో మీరు కావాలంటే అర టీ స్పూన్ యాలకుల పొడి లేదా పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కలుపుకోవచ్చు. పచ్చి కొబ్బరి రుచిని అలాగే ఉంచాలనుకుంటే వీటిని వేయాల్సిన అవసరం లేదు. మాడిపోకుండా ఉండటానికి మంటను తక్కువలో ఉంచి, కలుపుతూ ఉండటం ముఖ్యం.

4 / 5
 మిశ్రమం తగినంత చిక్కబడిన తర్వాత, వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు లేదా స్టీల్ గిన్నెలోకి పోసి, 
 పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత, ఒకటిన్నర నుండి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన జున్నును గిన్నె నుండి ప్లేట్‌లోకి తిప్పి, డీమోల్డ్ చేయాలి. పైన కొద్దిగా పుదీనా ఆకులతో లేదా డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించవచ్చు. ఈ  రుచికరమైన కొబ్బరి జున్నును కత్తితో ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా స్పూన్‌తో నేరుగా తినొచ్చు.

మిశ్రమం తగినంత చిక్కబడిన తర్వాత, వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు లేదా స్టీల్ గిన్నెలోకి పోసి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత, ఒకటిన్నర నుండి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన జున్నును గిన్నె నుండి ప్లేట్‌లోకి తిప్పి, డీమోల్డ్ చేయాలి. పైన కొద్దిగా పుదీనా ఆకులతో లేదా డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించవచ్చు. ఈ రుచికరమైన కొబ్బరి జున్నును కత్తితో ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా స్పూన్‌తో నేరుగా తినొచ్చు.

5 / 5
Follow Us
పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. తింటే మళ్లీ మళ్లీ

రికార్డ్ టైమింగ్‎తో దుమ్ములేపిన తెలుగమ్మాయి

రావణుడి పది తలలు దేనికి సంకేతం? ఆ 10 దుర్గుణాలు ఏమిటో తెలుసా?

క్రేజీ కాంబినేషన్.. ఆ సౌత్ డైరెక్టర్ తో హృతిక్ రోషన్ సినిమా..

కాబోయే భార్యతో కలిసి బతుకమ్మ సంబరాల్లో డైరెక్టర్ డేగల బాబు

ఉప్పల్‌–నాగోల్‌ రోడ్డులో కారు బీభత్సం.. ఫౌంటెన్‌లా ఎగసిపడ్డ నీరు

18 ఏళ్లు నిండాక పాన్ కార్డులో ఫొటో, సంతకం అప్డేట్ చేేసుకోవడం ఎలా

భువీ స్వింగ్‌కు కివీస్ బ్యాటర్లు దొరుకుతారా.. లేక పాత కథేనా?

దసరా తర్వాత.. వీరికి విపరీతంగా కలిసివస్తుంది.. మీ రాశి ఉందా?

కివీస్ గడ్డపై టీమిండియా జోరు సాగుతుందా?
కివీస్ గడ్డపై టీమిండియా జోరు సాగుతుందా?