AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ ముక్కలు మెత్తగా ఉడకాలంటే ఈ ఒక్కటి వేస్తె చాలు.. స్పాంజిలా.. తినాలనిపించే రుచితో

మటన్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, మటన్ ముక్కలు మెత్తగా ఉడకడం అనేది ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. సాధారణంగా చాలా మంది కుక్కర్ వాడతారు. కానీ, కుక్కర్ అవసరం లేకుండానే మటన్‌ను నోట్లో కరిగిపోయేలా మెత్తగా, క్రీమీగా ఎలా ఉడికించాలో ఈ రెసిపీలో తెలుసుకుందాం. మటన్ ఉడికించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన చిట్కా ఈ వంటకాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 20, 2026 | 10:43 AM

Share
మొదట, ఒక మిక్సీ జార్‌లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, రెండు స్పూన్ల గసగసాలు, రెండు లవంగాలు, నాలుగు ఐదు యాలకులు, ఒక చిన్న చెక్క ముక్క, ఏడు ఎనిమిది జీడిపప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ తగినంత నీరు పోసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.

1 / 5

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ పసుపు వేయాలి. వెంటనే సన్నగా తరిగిన రెండు మూడు పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేవరకు రెండు నిమిషాల పాటు వేయించాలి.

2 / 5
శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కిలో మటన్‌ను ఇందులో వేసి, గరిటతో బాగా కలపాలి. దీనిలో ఉప్పును అస్సలు వేయకూడదు. ఉప్పు వేస్తే మటన్ గట్టిగా అయ్యే అవకాశం ఉంది. మటన్ బాగా మెత్తగా ఉడకాలి అంటే, ఒక చిన్న కొబ్బరి చిప్ప ముక్కను (కొబ్బరి తీసిన తర్వాత ఉండే చిప్ప) మటన్‌తో పాటు వేయాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

3 / 5
మటన్ నుండి నీరు బయటకు వస్తుంది. ఆ నీటితోనే మటన్‌ను బాగా ఉడికించుకోవాలి. నీరంతా ఇగిరిపోయేవరకు ఉడికించిన తర్వాత, మటన్ మెత్తబడిందో లేదో ఒకసారి తనిఖీ చేయాలి.ముక్క ఇంకా కొద్దిగా మెత్తగా కావాలంటే, అర గ్లాసు నీటిని చేర్చి, బాగా కలిపి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఈ సమయానికి మటన్ ముక్కలు పూర్తిగా మెత్తగా అవుతాయి.

4 / 5
మటన్ పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాత, సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి, రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ను వేసి, మటన్‌కు బాగా పట్టేలా కలపాలి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాలి. మసాలా వాసన పోయి, ముక్కలకు బాగా పట్టిన తర్వాత, మీ గ్రేవీకి అవసరమైనంత నీటిని చేర్చాలి. అంతా బాగా కలిపి, మధ్యస్థ మంటపై ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీ బాగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత, మనం వేసిన కొబ్బరి చిప్పను కర్రీ నుండి తీసివేయాలి. ఇప్పుడు అర స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

మటన్ పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాత, సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి, రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ను వేసి, మటన్‌కు బాగా పట్టేలా కలపాలి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాలి. మసాలా వాసన పోయి, ముక్కలకు బాగా పట్టిన తర్వాత, మీ గ్రేవీకి అవసరమైనంత నీటిని చేర్చాలి. అంతా బాగా కలిపి, మధ్యస్థ మంటపై ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీ బాగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత, మనం వేసిన కొబ్బరి చిప్పను కర్రీ నుండి తీసివేయాలి. ఇప్పుడు అర స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

5 / 5
Follow Us