Geetanjali Shree: తొలిసారిగా భారతీయ రచయిత్రి గీతాంజలి శ్రీ (Geetanjali Shree) తన నవల టోంబ్ ఆఫ్ శాండ్ (Tomb of Sand) అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ (International Booker Prize)ని గెలుచుకున్నారు. దీనిని హిందీ నుండి ఆంగ్లంలోకి డైసీ రాక్‌వెల్ (Daisy Rockwell) అనువదించారు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో రాసినమొదటి పుస్తకం టోంబ్ ఆఫ్ శాండ్, అవార్డు ద్వారా గుర్తించబడిన హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల అని అవార్డు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. మే 26, 2022న లండన్‌లో జరిగిన ప్రదానోత్సవ వేడుకలో న్యూ ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీకి ప్రైజ్ అందించారు. గీతాంజలితో పాటు రేత్ సమాధిని ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసిన డైకీ రాక్ వెస్ (Amercia)కు కలిపి ఈ గౌరవం అందించారు. అంతేకాదు 50వేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను సైతం క్యాష్ ఫ్రైజ్ గా అందించారు. టోంబ్ ఆఫ్ సాండ్ వాస్తవానికి ‘రెట్ సమాధి’, ఉత్తర భారతదేశంలో 80 ఏళ్ల వృద్ధురాలి కథ. తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్ లోకి జారుకుంటుంది. ఆపై ఆమె జీవితం కొత్తగా మారుతుంది. అది ఎలా జరిగింది అనేది నవలా కథ. ఈ కథను బుకర్ న్యాయమూర్తులు ‘ఆనందకరమైన కాకోఫోనీ’, ‘ఇర్రెసిస్టిబుల్ నవల’ అని పిలిచారు.
A moment of pride!
Congratulations to the author of Geetanjali Shree for winning 2022 @TheBookerPrizes for her Hindi translated novel ‘Tomb of Sand’.
Originally published in Hindi as ‘Ret Samadhi’, it is the first book in any Indian language to win the prestigious award. pic.twitter.com/N485hxkS76
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) May 27, 2022
ఆమె గతంలో రాసిన మయి(2000) అనే నవల క్రాస్ వర్డ్ బుక్ అవార్డు 2001కి ఎంపికైంది. బుకర్ ప్రైజ్ కు మెుత్తం 135 పుస్తకాలను జ్యూరీ పరిశీలించింది. చివరకు ‘టూంబ్ ఆఫ్ సాండ్’కు ఆ గౌరవం దక్కింది. ఇప్పటికే ఈ బుక్‘ ‘ఇంగ్లిష్ పెన్’ అవార్డును సైతం గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో జన్మించిన గీతాంజలి శ్రీ.. ప్రస్తుతం న్యూదిల్లీలో ఉంటున్నారు. అవార్డు గెలుచుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నేను బుకర్ గురించి కలలో కూడా ఊహించలేదు, నేను ఇది సాధించగలనని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా పెద్ద గుర్తింపు, ఇది రావడంతో నేను ఆశ్చర్యపోయాను, చాలా సంతోషించాను, గౌరవంగా భావించాను. ఇది వచ్చినందుకు చాలా వినయంగా కూడా ఉన్నాను.. అని గీతాంజలి శ్రీ అవార్డును స్వీకరించే అంగీకార ప్రసంగంలో అన్నారు.
Wonderful recognition. Congratulations to @GeetanjaliShree ! https://t.co/HcGNUOarxz
— Shashi Tharoor (@ShashiTharoor) May 27, 2022
వాస్తవానికి 2018లో హిందీలో రేత్ సమాధి ప్రచురించబడింది. ‘టూంబ్ ఆఫ్ సాండ్’ ఆమె పుస్తకాలలో యూకే ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యింది. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా ఆగస్టు 2021లో ఆంగ్లంలో ప్రచురించబడింది. మొత్తం 135 పుస్తకాలను యూకేకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించింది. చివరి తరుణంలో ఆరు పుస్తకాలు బుకర్ ప్రైజ్ కోసం పోటీపడ్డాయి. అందులో ‘టాంబ్ ఆఫ్ శాండ్’కు ఈ గౌరవం దక్కింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి