NATO membership: జర్మనీలో G-7 కూటమి భేటీ తర్వాత సీన్- స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు మారింది. ఉక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత నాటోను మరింత బలోపేతం చేసే దిశగా ఈ కూటమి ఇక్కడ భేటీఅయింది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చలు జరిగాయి. కాగా ఈ రెండు దేశాలను నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్దోగాన్ తన మనసు మార్చుకున్నారు. స్వీడన్, ఫిన్లాండ్ చేరికను ఆహ్వనించిన టర్కీ, ఈ దేశాలు 33 మంది ఉగ్రవాద అనుమానితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతామని మెమోరాండంపై సంతంకం చేశాయి.
ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు చేరేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని నాటో చీఫ్ స్టోలెన్‌బర్గ్ మీడియాతో తెలిపారు. నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ చేరికను స్వాగతించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మాడ్రిడ్ చేరుకున్న బైడెన్ స్పెయిన్ రాజు ఫెలిపేతో భేటీ అయ్యారు. నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు స్టోలెన్‌బర్గ్‌తో భేటీ అయ్యారు బైడెన్. రష్యాకు ధీటుగా నాటోనే విస్తరించే అంశంపై చర్చించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశీ పర్యటనలో భాగంగా తజకిస్తాన్ చేరుకున్నారు. ఉక్రెయిన్‌తో పాటు ఫిన్లాండ్-స్వీడన్‌లు కూడా నాటోలో చేరడాన్ని రష్యా ఇప్పటికే వ్యతిరేకించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..