AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించిన ట్రంప్.. 12 రోజుల యుద్ధం ముగిసిందని వెల్లడి!

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. సీజ్‌ ఫైర్‌కు రెండు దేశాలు అంగీకరించడంతో 12 రోజులుగా కొనసాగుతున్నయుద్దం ముగిసిందంటూ ట్రంప్ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయని మరో 24 గంటల్లో పూర్తిగా యుద్దం ముగుస్తుందని ట్రంప్ పేర్కొన్నాడు.

Donald Trump: ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించిన ట్రంప్.. 12 రోజుల యుద్ధం ముగిసిందని వెల్లడి!
Iran Israel War
Anand T
|

Updated on: Jun 24, 2025 | 4:54 AM

Share

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. రెండు దేశాలు తమ “తుది మిషన్లను” పూర్తి చేసిన తర్వాత, ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుందని.. ఇజ్రాయెల్ 12 గంటల తర్వాత అనుసరిస్తుందని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలు సీజ్‌ ఫైర్‌కు అంగీకరించడంతో 12 రోజులుగా కొనసాగుతున్నయుద్దం ముగిసిందంటూ ట్రంప్ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయని మరో 24 గంటల్లో పూర్తిగా యుద్దం ముగుస్తుందని ట్రంప్ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ రెండు దేశాలకు అభినందనలు తెలిపాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ ఉంటుందని అన్నారు. ప్రతి కాల్పుల విరమణ సమయంలో, ఓ వైపు శాంతియుతంగా, మరోవైపు గౌరవప్రదంగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. యుద్ధాన్ని ధైర్యంగా ముగించినందుకు ఇజ్రాయెల్, ఇరాన్‌లను ట్రంప్ ప్రశంసించారు

ఈ రెండు దేశాలు అనుకుంటే ఇది సంవత్సరాల తరబడి కొనసాగే యుద్ధం, దీని వల్ల మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం అయి ఉండేది, కానీ ఇరాన్, ఇజ్రాయెల్ ఎంతో ఒర్పుతో, తెలివితేటలతో కాల్పుల విరమణకు ముందుకొచ్చాయి.. దీంతో ఎలాంటి నష్టం జరగలేదు, ఇకపై కూడా ఎప్పటికీ జరగదు అని ట్రంప్ అన్నారు.

ఇక చివరికీ ట్రంప్ ఇలా రాసుకొచ్చారు. అమెరికాతో పాటు మధ్యప్రాచ్యాన్ని, ఇరాన్, ఇజ్రాయెల్‌లను, ప్రపంచాన్ని దేవుడు చల్లగా దీవించుగాక అని ట్రంప్ ఆయన చేసిన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..