Donald Trump: భారత్‌కు ట్రంప్ మరోషాక్.. 50శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటన!
భారత్ దేశానికి ఆగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ షాక్ ఇచ్చారు. భారత్ వస్తువులపై 50శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కొలిక్కి రాకపోవడంతో గత నెల 31వ తేదీన భారత్ 25శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు పేర్కొన్న ట్రంప్ .. వాటిని 50శాతానికి పెంచుతున్నట్టు తాజాగా కాసేపటి క్రితమే ప్రకటించారు.

భారత్ దేశంపై టారిఫ్‌ల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత్‌పై ఇటీవలే విధించిన 25శాతం సుంకాన్ని మరో 25శాతం యాడ్ చేస్తూ మొత్తాన్ని 50శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించాడు. రష్యా నుంచి భారత దేశానికి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, దాని వల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ట్రంప్ ఆరోపించాడు. ఈనేపథ్యంలోనే భారత్‌పై ట్రంప్ సుంకాన్ని పెంచినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై మంగళవారం అంతర్జాతీయ మీడియాలో ట్రంప్ మాట్టాడుతూ.. వాణిజ్యం విషయంలో భారత్ అమెరికాకు మంచి భాగస్వామి కాదని ఆయన పేర్కొన్నారు. భారత్ అమెరికాతో పెద్దమొత్తంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ.. అమెరికా మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నాడు. అంతే కాకుండా భాతర్ తమ దేశం వస్తువులపై కూడా అధిక మొత్తం టారిఫ్‌లు విధిస్తుందని ట్రంప్ అన్నాడు. అందుకోసమే ఇంతకు ముందు భారత్ 25శాతం సుంకాలు విధించాంమని పేర్కొన్నారు. తాజాగా దనికి అదనంగా మరో 25శాతం యాడ్ చేస్తూ మొత్తం 50శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ బుధవారం ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.