PM Modi: అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగమంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్ పాల్గొన్నారు.

అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటి అయ్యారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగమంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్ పాల్గొన్నారు. వలసలు, వాణిజ్యం, సుంకాలే ప్రధాన అజెండాగా ఇరు దేశాల నేతలు చర్చించారు. ఇరువురు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపైనా దృష్టి సారించారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్ కలిసి ఉండటం చాలా ముఖ్యమన్నారు ట్రంప్. అలాగే పలు విషయాలపై పరస్పరం అంగీకారం తెలిపాయి ఇరు దేశాలు.
మరోవైపు అమెరికాలో అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో భారత పౌరులు అక్రమంగా ఎవరున్నా వెనక్కి తీసుకుంటామన్నారు. పేద ప్రజలను మభ్యపెట్టి కొందరు.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ ఎకోసిస్టమ్ మొత్తాన్ని నాశనం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అమెరికా దీనికి సహకరిస్తుందని అనుకుంటున్నానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
అమెరికాకి ఆయిల్, గ్యాస్ వనరులు పుష్కలంగా ఉన్నాయ్.. అవి భారత్‌కి కావాలి. నా ఫ్రెండ్ మోదీని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. అటు భారత్‌తో స్నేహబంధం కొనసాగుతుందని, కలిసి ముందుకెళ్తామని చెప్పారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ట్రంప్‌కు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. ఆయన అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు. ఇరుదేశాలు కలిసి మరింత ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని అన్నారు. యుద్ధం ఆపాలని పుతిన్‌తో గంటన్నర మాట్లాడానన్నారు ట్రంప్. దీనికి బదులుగా భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్నారు ప్రధాని మోదీ. శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఎప్పుడూ లభిస్తుందన్నారు.
ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీతో జరిగిన మీటింగ్‌లోనే టారిఫ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్‌తో వాణిజ్యం చాలా కష్టంగా మారింది. తమ వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని.. తాము కూడా సుంకాలు విధిస్తామన్నారు. అలాగే భారత్‌కు క్రిమినల్స్‌ను అప్పగిస్తామన్నారు డొనాల్డ్ ట్రంప్. నవంబర్ 28 ఉగ్రదాడి సూత్రధారిని అప్పగిస్తున్నాం. ఇంకా క్రిమినల్స్‌ను సైతం అప్పగిస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..