Video: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో మార్మోగిన హరహర మహాదేవ్ నినాదాలు.. వీడియో షేర్ చేసిన సద్గురు..

Mahashivratri With Sadhguru At Adiyogi: "హర హర మహాదేవ్" పాటకు అనుగుణంగా నృత్యం చేయకుండా న్యూయార్క్ వాసులు తమను తాము ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను సద్గురు తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. హర హర మహదేవ్ పాటకు ప్రజలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో మీరు వీడియోలో చూడవచ్చు. భారతదేశంలోని ఆదియోగిలో మహాశివరాత్రి మాయాజాలాన్ని చూడటానికి న్యూయార్క్ వాసులు ఉత్సాహంగా ఉన్నారు. శివరాత్రి ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తోందని సద్గురు పోస్ట్ పంచుకున్నారు.

Video: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో మార్మోగిన హరహర మహాదేవ్ నినాదాలు.. వీడియో షేర్ చేసిన సద్గురు..
Mahashivratri With Sadhguru

Updated on: Mar 06, 2024 | 9:13 PM

New Yorkers Groove To Har Har Mahadev: మహాశివరాత్రి పండుగ రాబోతోంది. మహదేవ్ మంత్రోచ్ఛారణలతో దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కూడా ‘హర హర మహాదేవ్’ నినాదాలతో మార్మోగింది.

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లోని అత్యంత రద్దీగా ఉండే వీధిలో ఎక్కడ చూసినా మహదేవ్ మంత్ర జపమే కనిపించింది. పవిత్ర శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ శివ శంభు జపంతో అసాధారణ దృశ్యం కనిపించింది. ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన మహాశివరాత్రి కార్యక్రమాల్లో ఒకటైన సద్గురుతో మహాశివరాత్రి వీడియో స్క్వేర్ లోని పెద్ద తెరపై ప్లే అవుతున్న సమయంలో ఎక్కడ చూసినా చప్పట్లే వినిపించాయి.

ఇవి కూడా చదవండి

‘హర హర మహాదేవ్’ పాటకు న్యూయార్కర్ల డ్యాన్స్..

“హర హర మహాదేవ్” పాటకు అనుగుణంగా నృత్యం చేయకుండా న్యూయార్క్ వాసులు తమను తాము ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను సద్గురు తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. హర హర మహదేవ్ పాటకు ప్రజలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో మీరు వీడియోలో చూడవచ్చు. భారతదేశంలోని ఆదియోగిలో మహాశివరాత్రి మాయాజాలాన్ని చూడటానికి న్యూయార్క్ వాసులు ఉత్సాహంగా ఉన్నారు. శివరాత్రి ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తోందని సద్గురు పోస్ట్ పంచుకున్నారు. సద్గురు గురించి, కార్యక్రమం గురించి తెలుసుకుని ప్రజలు పులకించిపోయారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని..

తమిళనాడులో సద్గురు నిర్వహించే మహాశివరాత్రి కార్యక్రమం ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వార్షిక కార్యక్రమాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం సంగీతం, నృత్యం, సాధనల విడదీయరాని సంగమాన్ని చూసేందుకు వీలు కల్పిస్తుంది. మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా 22 భాషల్లో సద్గురు యూట్యూబ్ ఛానళ్లలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రామ్ లో పలువురు బడా సెలబ్రిటీలు కూడా చేరే అవకాశం ఉందని అంటున్నారు.