AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం.. 16 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు!

చైనాలోని టిబెట్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్‌ స్కేలుపై 7 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 16 మంది మరణించగా, మరో 54 మంది గాయపడ్డారు. భూకంప ధాటికి ఉత్తర టిబెట్‌లోని నాగ్చు పట్టణ పరిసరాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పశువుల ఆశ్రయాలు సైతం ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.

టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం.. 16 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు!
Tibet Earthquake
Balaraju Goud
|

Updated on: Oct 23, 2026 | 7:11 AM

Share

చైనాలోని టిబెట్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్‌ స్కేలుపై 7 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 16 మంది మరణించగా, మరో 54 మంది గాయపడ్డారు. భూకంప ధాటికి ఉత్తర టిబెట్‌లోని నాగ్చు పట్టణ పరిసరాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పశువుల ఆశ్రయాలు సైతం ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.

339 ఇళ్లు, 20 పశువుల కొట్టాలు ధ్వంసం

చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంపం కారణంగా నాగ్చు పట్టణంలో కనీసం 339 ఇళ్లు, 20 పశువుల కొట్టాలు కూలిపోయాయి. దీంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో భాగంగా 1,600 మందికి పైగా సిబ్బందిని మోహరించారు.

ప్రభావిత ప్రజల కోసం 1,000 తాత్కాలిక ఆశ్రయాలు, దాదాపు 3,000 టెంట్లను పంపించారు. వీటితో పాటు మడత మంచాలు, టార్చ్‌లైట్లు, శీతాకాలపు దుస్తులను కూడా అందుబాటులో ఉంచారు. భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతం గుండా వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసివేత

భూకంప తీవ్రతకు పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు రహదారులపై పడటంతో జాతీయ రహదారి 317లోని కొంత భాగాన్ని అధికారులు మూసివేశారు. అత్యవసర సేవలు, సహాయక బృందాలు, ప్రభుత్వ సహాయక వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. రహదారిపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా, భూకంప ప్రభావిత ప్రాంతంలో రాబోయే మూడు రోజులపాటు అడపాదడపా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చలి తీవ్రత పెరిగితే నిరాశ్రయులైన ప్రజల పరిస్థితి మరింత కష్టంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఐదేళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం

చైనా ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సీసీటీవీ ప్రకారం.. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:33 గంటలకు భూకంపం సంభవించింది. భూమి ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. నాగ్చు పట్టణానికి తూర్పు-ఈశాన్యంగా సుమారు 191 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. టిబెట్ రాజధాని లాసాకు ఉత్తరాన 300 కిలోమీటర్లకు పైగా దూరంలో నాగ్చు ఉంది.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య, నష్టాల వివరాలపై అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. మంచు కురిసే అవకాశం నేపథ్యంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం అధికారులకు ప్రధాన సవాలుగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐదేళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం.. 16 మంది మృతి!
ఐదేళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం.. 16 మంది మృతి!
రణ్‌బీర్ ధరించిన ఈ వాచ్ ధర ఎన్ని లక్షలో తెలుసా? ప్రత్యేకత ఏంటంటే?
రణ్‌బీర్ ధరించిన ఈ వాచ్ ధర ఎన్ని లక్షలో తెలుసా? ప్రత్యేకత ఏంటంటే?
హైబీపీ అదుపులో ఉండాలంటే బీట్‌రూట్ జ్యూస్ మంచిదా?లేక దానిమ్మ రసమా?
హైబీపీ అదుపులో ఉండాలంటే బీట్‌రూట్ జ్యూస్ మంచిదా?లేక దానిమ్మ రసమా?
OTTలోకి వచ్చేసిన కీర్తి సురేష్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ ఉంది
OTTలోకి వచ్చేసిన కీర్తి సురేష్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ ఉంది
మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!
మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!
ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ 2027 విడుదల..
ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ 2027 విడుదల..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన హెల్దీ టిఫిన్
అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన హెల్దీ టిఫిన్
చెరపకుండా గీతను చిన్నది చేయడం సాధ్యమేనా? ఈ బుడ్డోడి తెలివి చూడండి
చెరపకుండా గీతను చిన్నది చేయడం సాధ్యమేనా? ఈ బుడ్డోడి తెలివి చూడండి
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా వీరికి కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా వీరికి కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం