
పర్యావరణాన్ని కాపాడేందుకు, సంరక్షించేందుకు ప్రతిఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తూ ఏటా జూన్ 5 న జరుపుకునేదే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సోమవారం జరగనున్న ఈ ప్రత్యేక రోజున అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పర్యావరణం ప్రాముఖ్యత గురించి తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అయితే ఈ ఏడాది మనం జరుపుకోబోయేది 50వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా నెదర్లాండ్ సహాకారంతో ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఇవోరీ కోస్ట్ అనే దేశం హోస్ట్ చేస్తోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు తన నాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థిమ్‌ను ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలుగా నిర్ణయించారు. #బీట్ ప్లాస్టిక్ పోల్యూషన్ అనే ప్రచారంతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టనున్నారు.
అయితే 2014లోనే ఇవోరీ కోస్ట్ దేశం ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసింది. పునర్వినియోగ ప్యాకేజింగ్‌ను ప్రోత్సహిస్తోంది. అక్కడ అబిడ్జాన్ అనే పట్టణం పర్యావరణ పరిరక్షణకు హబ్‌గా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం శాంపంగా కనిపించే ముప్పని.. అది అన్ని వర్గాలపైనా ప్రభావం చూపుతుందని.. ఇవోరి కోస్ట్ పర్యావరణ శాఖ మంత్రి జీన్ లుక్ అస్సీ అన్నారు. మరోవైపు ప్లాస్టిక్ కాలుష్యం.. ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై ప్రభావం చూపుతోందని నేదర్లాండ్ పర్యావరణ శాఖ మంత్రి వివియన్నే హీజ్‌నేన్ అన్నారు. దీన్ని నివారించేందుకు తక్షిణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. దీనికోసం సరైన, సమర్థవంతమైన పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..