జూమ్ యాప్ మీటింగ్‌లో తలకిందులుగా వీడియో ప్లే.. అసహనానికి గురైన కాంగ్రెస్ సభ్యుడు.. వైరల్ అవుతున్న వీడియో..
కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడ్డ సిటిజన్లకు ఊరట కలిగించడానికి యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ
కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడ్డ సిటిజన్లకు ఊరట కలిగించడానికి యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం సభ్యులు, అధికారులతో కలిసి ఆన్‌లైన్ జూమ్ యాప్ కేంద్రంగా సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన చిన్న పొరపాటుపై ఇప్పుడు ఆన్‌లైన్ వేదికగా రచ్చ జరుగుతోంది.
సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ సభ్యుడు టామ్ ఎమ్మర్ మాట్లాడుతున్నప్పుడు వీడియో తలక్రిందులుగా ప్లే అయింది. అప్పుడు టామ్ ఎమ్మర్ ఇది తలక్రిందులుగా ఎందుకు వస్తుందో తనకు తెలియదని, దీనిని ఒకసారి ఆపివేసి, తిరిగి మళ్లీ ప్రారంభిస్తానని చెప్పిన మాటలు అందరికి వినిపించాయి. ఇలా జరగడంపై అసహనానికి గురైన టామ్ ఎమ్మర్ తన ఫ్లోటింగ్ హెడ్ యొక్క స్క్రీన్ షాట్‌ను తీసి తాను తలకిందులుగా వేలాడడానికి పిల్లిని కాదని ట్వీట్ చేశాడు. దీంతో దీనిపై దుమారం చెలరేగింది. అయితే సమావేశంలో ఎమ్మర్ తలకిందులుగా కనిపించడానికి గల కారణాలు తెలియరాలేదు కానీ వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్‌వేర్‌లలో ఏదో లోపం ఉన్నట్లు మాత్రం గుర్తించారు. టామ్ ఎమ్మర్ ఇలా తలకిందులుగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. కరోనా వల్ల అందరు ఆన్‌లైన్ సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమందికి ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు.
I am not a cat. pic.twitter.com/d4lhQd0sJ4
— Tom Emmer (@RepTomEmmer) February 10, 2021
మహారాష్ట్ర గవర్నర్‌కి చేదు అనుభవం, రెండు గంటలు వేచాక మరో విమానంలో ఉత్తరాఖండ్ పయనం మహారాష్ట్ర