మహారాష్ట్ర గవర్నర్‌కి చేదు అనుభవం, రెండు గంటలు వేచాక మరో విమానంలో ఉత్తరాఖండ్ పయనం మహారాష్ట్ర
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ కి ఏ గవర్నర్ కూ కలగని అనుభవం కలిగింది. ఉత్తరాఖండ్ వెళ్లేందుకు ప్రభుత్వ విమానం ఎక్కదలిచిన ఆయనకు ప్రభుత్వం..
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ కి ఏ గవర్నర్ కూ కలగని అనుభవం కలిగింది. ఉత్తరాఖండ్ వెళ్లేందుకు ప్రభుత్వ విమానం ఎక్కదలిచిన ఆయనకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. మొదట విమానం ఎక్కగానే ఆయన వద్దకు పైలట్ వఛ్చి మీకు పర్మిషన్ లేదని చెప్పగానే దిగిపోయారు. చివరకు రెండు గంటలు వెయిట్ చేసిన అనంతరం ఆయన మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు విమానంలో ఉత్తరాఖండ్ బయల్దేరి వెళ్లారు. గవర్నర్ కు అవమానం జరిగిందని, ముఖ్యమంత్రి ఆయనకు క్షమాపణ చెప్పాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కి 12 మంది పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయగా గవర్నర్ దాన్ని ఆమోదించకుండా, సంతకం చేయకుండా ఆ ఫైలును తనవద్దే ఉంచుకున్నారు. దీంతో ప్రభుత్వానికి, ఆయనకు మధ్య పోరు నేరుగా మొదలైంది.
తన ఆమోదం అంశాన్ని వాయిదా వేసి ఆయన ఉత్తరాఖండ్ పర్యటన పెట్టుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కల్గించింది. అసలే సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆయన తీరుపట్ల మండిపడుతున్నారు.
Also Read:
అక్షర్‌ధామ్ టెంపుల్ అటాక్ నేపథ్యంగా ‘జీ5’ సిరీస్.. ఎన్‌ఎస్‌జీ కమాండోగా కనిపించనున్న అక్షయ్ ఖన్నా