డొనాల్డ్ ట్రంప్ కి శాశ్వతంగా ‘తలుపులు’ మూసేసిన ట్విటర్, ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా అదే అదే సీన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ట్విటర్ శాశ్వతంగా 'తలుపులు' మూసేసింది. తమ వేదికలోకి  ఆయనను అడుగుపెట్టనివ్వబోమని,  అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా..

డొనాల్డ్ ట్రంప్ కి శాశ్వతంగా 'తలుపులు' మూసేసిన ట్విటర్, ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా అదే అదే సీన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 11, 2021 | 1:36 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ట్విటర్ శాశ్వతంగా ‘తలుపులు’ మూసేసింది. తమ వేదికలోకి  ఆయనను అడుగుపెట్టనివ్వబోమని,  అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా ఇదే పరిస్థితి ఉంటుందని ట్విటర్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్ తెలిపారు. తమ విధానాల ప్రకారం ఈవేదికపై నుంచి మిమ్మల్ని తొలగించినప్పుడు, మీరు కామెంటేటర్ అయినా, సీఎఫ్ఓ అయినా, ప్రస్తుత మాజీ అధ్యక్షుడైనా సరే..ఇదే సూత్రం వర్తిస్తుంది ఆయన చెప్పారు. జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ వద్ద తన మద్దతుదారుల చేత ట్రంప్ పెద్ద ఎత్తున అల్లర్లను, ఘర్షణలను ప్రేరేపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో  ట్విటర్ సహా ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా సాధనాలు కూడా ఆయనను బ్యాన్ చేశాయి. హింసను, అల్లర్లను రెచ్ఛగొట్టనివారికి మాత్రమే తమ పాలసీలు అనుకూలంగా ఉంటాయని నెడ్ సెగాల్ స్పష్టం చేశారు.

ఇలా వయొలెన్స్ ను సృష్టించేవారిని మళ్ళీ అడుగుపెట్టనిచ్ఛే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. తను అధ్యక్షునిగా ఉండగా ట్రంప్… ట్విటర్ ను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకున్నారు. తన ఎన్నికల ప్రచారానికి, తన ప్రత్యర్థులను దుయ్యబట్టడానికి దీనిపైనే ఆధార పడుతూ వచ్చారు.  ట్విటర్ లో ఆయన అకౌంట్ క్లోజయ్యే నాటికి ఆయనకు 80 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Read More: Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ సాయమందించండి.. నరేంద్ర మోదీకి కెనడా పీఎం ఫోన్‌.. ఎలాంటి హామీ ఇచ్చారంటే?

Read More: Earthquake: మిజోరంలోని చంపాయ్‌లో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం.. హింద్‌కుష్ పర్వతాల్లో కూడా..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే