ఈ నెల మొదటివారంలో దారుణ హత్యకు గురైన హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిజ్ భార్య మార్టిన్ మొయిజ్ మొదటిసారిగా నోరు విప్పారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించిన విషయం గమనార్హం. పూర్తిగా కోలుకుని ప్రస్తుతం వాషింగ్టన్ లో ఉన్న ఈమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైంది. సెక్యూరిటీ గార్డులు, కుటుంబ సభ్యులు, దౌత్యాధికారుల సమక్షంలో ఆమె మాట్లాడుతూ.. జులై 7 న రాత్రి తాము గదిలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినబడిందని, తాము లేచేలోగా హంతకులు తమపై కాల్పులు జరిపారని, తన భర్త రక్తపు మడుగులో కుప్ప కూలిపోయారని ఆమె చెప్పారు. తీవ్రంగా గాయపడిన తానుకూడా మరణించాననుకుని వారు వెళ్లిపోయారని అన్నారు. తమ కుటుంబాన్ని రక్షించేందుకు నియమితులైన 30 నుంచి 50 మంది గార్డులు ఆ రోజున ఏమయ్యారో ఆశ్చర్యంగా ఉందని, వారిలో ఎవరూ గాయపడడం గానీ, మరణించడంగానీ జరగలేదని ఆమె చెప్పారు. సాయం కోసం తన భర్త జొవెనెల్ మొయిజ్ కేకలు పెట్టినా స్పందన లేకపోయిందన్నారు.
హంతకుల ఫైరింగ్ లో తన చేతిపైన, కణత పైన గాయాలయ్యాయన్నారు. తన నోటినిండా బ్లడ్ ఉండడంతో శ్వాస కూడా తీసుకోలేకపోయానని మార్టిన్ వెల్లడించారు. కిల్లర్స్ స్పానిష్ భాషలో మాట్లాడారని, ఫైరింగ్ చేస్తూనే ఎవరినో కాంటాక్ట్ చేస్తూ వచ్చారని ఆమె చెప్పారు. ఆ కిల్లర్స్ ఎవరో తెలుసుకోవాల్సి ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..లేకపోతే హైతీ కొత్త అధ్యక్షునిపై కూడా వారు దాడి చేస్తారు అని ఆమె అన్నారు. వారంటే తనకు భయం లేదన్నారు. హైతీలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా హైతీ ప్రెసిడెంట్ హత్యకు సంబంధించి ఆయన సెక్యూరిటీ చీఫ్ ను, కొలంబియాకు చెందిన 20 మందికి పైగా హంతకులను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది హైతీ వాసులు కూడా ఇందుకు సహకరించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : భారీ వర్షాలు ఆ గ్రామానికి శాపాలుగా మారాయి.. ఎడ్లబండి లోనే ప్రసవించిన మహిళ..:woman gave birth in cart Video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.
ప్రిన్సిపల్ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం..వానర బీభత్సం..:Monkey In School Video.
సముద్రం అడుగున చిక్కిన ఏలియన్స్ ..!రష్యా చేపల వేటలో వింత చేప..ఏలియన్ రూపంలో..:Alien In Sea video.