Oldest Man: వరల్డ్ రికార్డు..127 ఏళ్ల వయసులో మరణించిన వ్యక్తి.. ఇంకా ధృవీకరించని గిన్నీస్ బుక్

|

Oct 01, 2021 | 4:05 PM

సాధారణంగా మనుషులు ఎన్ని ఏళ్లు బతుకుతారు. 50 నుంచి 70 వరకు బతుకుతారు. మహా అయితే 100 ఏళ్లు బతుకుతారు. కానీ ఓ వ్యక్తి 127 సంవత్సరాలు బతికాడు....

Oldest Man: వరల్డ్ రికార్డు..127 ఏళ్ల వయసులో మరణించిన వ్యక్తి.. ఇంకా ధృవీకరించని గిన్నీస్ బుక్
Oldest
Follow us on

సాధారణంగా మనుషులు ఎన్ని ఏళ్లు బతుకుతారు. 50 నుంచి 70 వరకు బతుకుతారు. మహా అయితే 100 ఏళ్లు బతుకుతారు. కానీ ఓ వ్యక్తి 127 సంవత్సరాలు బతికాడు. నమ్మడం లేదా.. అయితే ఇది మీరు చదవాల్సిందే.. ఆఫ్రికాలోని అజెఫాలో ఎరిట్రియాకు చెందిన నటాబే మాచేట్ సోమవారం మరణించాడు. ఇందులో వింతేముంది అంటారా. అయితే ఇతను చనిపోయింది 127 ఏళ్లకని అతని కుటుంబ సంభ్యులు చెబుతున్నారు. అందుకే అతని కుటుంబం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అతన్ని అత్యంత పురాతన వ్యక్తిగా అధికారికంగా గుర్తించాలని కోరింది. అతని మనవడు తాతా పుట్టకకు సంబంధించి పత్రాలను గిన్నీస్ బుక్ వాళ్లకు అందించారు. చర్చి రికార్డులు ప్రకారం 1894లో నటాబే జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రంలో ఉందన్నారు. అయితే ఆయన జన్మించిన పదేళ్ల తర్వాత బాప్టిజం పొందాడని తెలిపారు. తన తాత 127 ఏళ్లు బతికినట్లు తను ఇచ్చిన సమాచారాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరిస్తున్నాయని మనవడు జీర్ అన్నారు. సహనం, దాతృత్వం, సంతోషకరమైన జీవితం మిస్టర్ నటాబే దీర్ఘాయువు యొక్క రహస్యంమని మీడియాకు చెప్పారు.

తన తాత “అసాధారణమైన వ్యక్తి” అని జీర్ అన్నారు. 1934 లో వివాహం నటాబే వివాహం చేసుకున్నారని చెప్పారు. వారిద్దరు సుద్ఘీకాలం జీవించారని చెప్పారు. అతని భార్య 2019 లో 99 సంవత్సరాల వయసులో మరణించారు. అతను తన జీవితంలో ఎక్కువ భాగం పశువుల కాపరిగా గడిపాడు. అతడు ఆవులు, మేకలు ఉన్నాయి. 2014 లో, నటాబే యొక్క 120 వ పుట్టినరోజును గ్రామం మొత్తం జరుపుకుంది. ప్రస్తుత అత్యధిక కాలం జీవించిన రికార్డు హోల్డర్ జీన్ కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ పేరు మీద ఉంది. ఆమె 1997లో 122 సంవత్సరాల వయసులో మరణించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన జిరోమోన్ కిమురా ఉన్నారు. అతను 2013 లో 116 సంవత్సరాల వయసులో మరణించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సమాధానం కోసం నటాబే కుటుంబం ఎదురుచూస్తోంది.

Read Also.. Telangana Assembly: పంచాయ‌తీరాజ్ కొత్త చ‌ట్టంతో గ్రామీణ వ్యవస్థ బలోతం.. శాసనసభలో సీఎం కేసీఆర్