కంపెనీ గోల్డెన్ ఆఫర్ః ఉద్యోగులకు జీతంగా నగదు బదులు బంగారం ఇస్తోంది..!

|

May 16, 2022 | 5:52 PM

ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ఉద్యోగులను ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్నటి మొన్న ఓ కంపెనీ ఉద్యోగుల అలసటను గుర్తించి.. కార్యాలయంలోనే నిద్రపోయేందుకు వెలసులుబాటు కల్పించింది. మరో కంపెనీ

కంపెనీ గోల్డెన్ ఆఫర్ః ఉద్యోగులకు జీతంగా నగదు బదులు బంగారం ఇస్తోంది..!
Employees Salary
Follow us on

ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ఉద్యోగులను ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్నటి మొన్న ఓ కంపెనీ ఉద్యోగుల అలసటను గుర్తించి.. కార్యాలయంలోనే నిద్రపోయేందుకు వెలసులుబాటు కల్పించింది. మరో కంపెనీ పెళ్లి కాని ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చటం, పెళ్లి చేసే బాధ్యతను తీసుకుంది. పెళ్లి తర్వాత ఆయా ఉద్యోగులకు కోరినన్ని సెలవులు ప్రకటించింది. పైగా, బోనస్‌లు, ఇంక్రిమెంట్లు ప్రకటించింది. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన Goldman Sachs Group Inc తమ సీనియర్ సిబ్బందిని అపరిమిత సంఖ్యలో సెలవులు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా చేయటం వల్ల ఉద్యోగులు తమ సంస్థపట్ల నిబద్ధతో ఉంటారని, ఆయా సంస్థల యాజమాన్యం విశ్వసిస్తోంది. దాంతో పనిపట్ల కూడా ఎంప్లాయిస్‌ మరింత ఔత్సహం, ఉత్సహంతో చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన టాలీమనీ అనే సంస్థ ఫైనాన్షియల్‌ సర్వీసులు అందిస్తోంది. బంగారం లాంటి జీతం వస్తుంది అన్న మాటకు అక్షరాల న్యాయం చేస్తోంది. తమ కంపెనీ ఉద్యోగులకు నిజంగానే బంగారాన్నే జీతంగా చెల్లిస్తోంది.

ఇంగ్లండ్‌కి చెందిన టాలీమనీ అనే సంస్థ ఫైనాన్షియల్‌ సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ ఎంతో మందికి ఆర్థిక సూచనలు అందిస్తూ ఉంటుంది. ఇలా సలహాలు ఇవ్వడమే కాదు మేము కూడా స్వయంగా పాటిస్తామంటున్నాడు ఆ కంపెనీ సీఈవో కెమెరాన్‌ పెర్రీ. ద్రవ్యోల్బణం కారణంగా తమ కంపెనీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే లక్ష్యంతో సరికొత్త జీతం చెల్లింపులకు శ్రీకారం చుట్టారు మనీలాటీ సీఈవో.. మనీటాలీలో ఉద్యోగులకు నెలవారీ జీతాన్ని నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. నగదు విలువ రోజురోజుకి పడిపోతుంది. కానీ బంగారం విలువ పడిపోవడం లేదు. పైగా విలువ పెరగడంతో బంగారానికి సాటి రాగలవి లేవంటున్నారు. అందుకే జీతంగా విలువ కోల్పోతున్న నగదు పౌండ్లకు బదులు బంగారాన్ని ఇస్తున్నారు. ముందుగా టాప్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ నిర్ణయం అమలు జరిపి సానుకూల ఫలితాలు వచ్చాక ఇప్పుడు కింది స్థాయి సిబ్బందికి కూడా వర్తింప చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఇరవై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లండన్‌ కేంద్రంగా వెలువడే సిటీ ఏఎం పత్రిక ప్రచురించింది.

ఇవి కూడా చదవండి