Khewra Salt Mines: అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన అద్భుత పదార్థం.. నేడు వందల కోట్లలో వ్యాపారం..

|

Nov 26, 2021 | 8:41 PM

Khewra Salt Mines: ప్రపంచ జగజ్జేత అలెగ్జాండర్.. వరుస దండయాత్రలతో ఎందరో రాజులని ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. అలెగ్జాండ్‌ ది గ్రేట్‌ గా..

Khewra Salt Mines: అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన అద్భుత పదార్థం.. నేడు వందల కోట్లలో వ్యాపారం..
Salt Mines Of Khewra
Follow us on

Khewra Salt Mines: ప్రపంచ జగజ్జేత అలెగ్జాండర్.. వరుస దండయాత్రలతో ఎందరో రాజులని ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. అలెగ్జాండ్‌ ది గ్రేట్‌ గా ఖ్యాతిగాంచాడు.  అయితే ఆ అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన ఓ పదార్థం ఇప్పుడు ఎమర్జింగ్‌ బిజినెస్‌గా మారింది. పాకిస్థాన్‌ మీదుగా భారత్ కు వచ్చిన ఈ వ్యాపారం ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఆరోగ్యంతోపాటు ఆకర్షణీయమైన వస్తువులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇంతకీ ఆ పదార్థం ఏంటో తెలుసా.. రాక్‌ సాల్ట్‌. ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే ఈ ఉప్పు ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగంగా ఉండేది… ఇప్పుడు కూడా భారత్‌ నుంచే విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది.

అలెగ్జాండర్‌ భారత్‌పైకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పటి భారత్‌ భూభాగం… ప్రస్తుతం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న కేవ్‌రా కొండల్లో అలెగ్జాండర్‌ సైన్యం బసచేసింది. స్వయంగా యుద్ధంలో పాల్గొన్న అలెగ్జాండర్‌ సైతం అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అలెగ్జాండర్‌కి ఎంతో ప్రీతిపాత్రమైన ఆయన గుర్రం అదే పనిగా అక్కడున్న బండరాళ్లను నాకడం అక్కడున్న అందరినీ ఆకర్షించింది. రాజుగారి గుర్రానికి ఏమైందా అని అంతా ఆరా తీశారు. చివరకు ఆ బండరాళ్లు ఉప్పును పోలిన రుచి ఉన్నట్టు గమనించారు. యుద్ధం ముగించి తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఆ ఉప్పు రాళ్లను తీసుకెళ్లి మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు.

క్రీస్తు పూర్వం అలెగ్జాండర్‌ దండయాత్రల తర్వాత రాక్‌సాల్ట్‌ వ్యాపారం మరుగున పడిపోయింది.  తర్వాత మొఘలలు.. అనంతరం 19 వ శతాబ్దం ప్రారంభంలో పంజాబ్‌లో సిక్కులు మొఘల్‌లను ఓడించి, వారు గని నుండి ఉప్పును తీయడం ప్రారంభించారు.  ఇప్పటి పేరుని సిక్కులు పెట్టిందే.. అయితే ఉప్పు గనిపై సిక్కుల నియంత్రణ ఎక్కువ కాలం కొనసాగలేదు. భారత లో అడుగు పెట్టిన ఆంగ్లేయుల కన్ను ఈ రాక్‌సాల్ట్‌పై పడింది. దీంతో 1870లో బ్రిటీషర్ల ‍ద్వారా రాక్‌సాల్ట్‌ మరోసారి ప్రపంచ ఉనికిలోకి వచ్చింది. అయితే దేశ విభజన తర్వాత ఉప్పు రాళ్లను కలిగిన కేవ్‌రా కొండలు పాకిస్థాన్‌ వశమయ్యాయి. అయితే అక్కడ మైనింగ్‌ తప్ప దానిని ప్రాసెస్‌ చేసే పరిశ్రమలు లేకపోవడంతో పెద్ద పెద్ద బండరాళ్లుగా బయటకు తీసి భారత్ కు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ ప్రాసెస్‌ చేసి టన్నుకి 300 డాలర్ల వంతున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో రాక్‌సాల్ట్‌ తో చేసిన వస్తువులకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం రాక్‌సాల్ట్‌ వ్యాపారం వంద కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే వేల ఏళ్ల క్రితమే ఈ ఉప్పు గొప్పతనం గురించి ఆయుర్వేద గ్రంథాల్లో మన మహర్షులు పేర్కొన్నారు.

Also Read:   ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా శుక్రవారం లక్ష్మీదేవిని ఈ మంత్రాలతో పూజించండి.. అద్భుత ఫలితం మీ సొంతం