Cow Viral Video: ఆస్పత్రిలోకి దూసుకొచ్చి పేషంట్లను కుమ్మేసిన ఆవు.. వైరలవుతున్న షాకింగ్ వీడియో.!
Cow Viral Video: ఎక్కడి నుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఓ ఆవు ఆస్పత్రిలో ఉన్న పేషంట్లపై పడి కుమ్మిపడేసింది. ఈ మధ్య...
Cow Viral Video: ఎక్కడి నుండి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఓ ఆవు ఆస్పత్రిలో ఉన్న పేషంట్లపై పడి కుమ్మిపడేసింది. ఈ మధ్య ఆవుల దాడులు ఎక్కువవుతున్నాయి. సాధు జీవుల్లా ఉండే ఆవులు… ఉన్నట్టుండి తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగుతున్నాయి. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ ఆస్పత్రిలోని వెయిటింగ్ రూంలోకి సడెన్‌గా దూసుకొచ్చిన ఆవు ఒక్కసారిగా రంకెలేస్తూ… అక్కడ కూర్చుని ఉన్న పేషంట్లపై విరుచుకుపడింది. దాంతో… అక్కడున్న వారు ఎటోళ్లటు పారిపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.
అక్కడ ఉన్న నలుగురు పేషెంట్లపై ఆవు దాడికి దిగగా… మరో ముగ్గురు తప్పించుకున్నారు. మరో మహిళపై మాత్రం ఆవు చాలాసేపటి వరకు దాడి చేసింది. అయితే ఆ ఆవుకి మెడకు ఓ తాడు కట్టి ఉంది. అది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఆ తాడు పట్టుకొని దాన్ని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడే తిరుగుతూ… దాడి చేసిన మహిళా పేషెంట్ అక్కడే పడిపోయి ఉండగా.. మరోసారి ఆమెపై దాడి చేసేందుకు వెళ్లింది. అది చూసిన ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆవు వెనక్కి వెళ్లారు.
కాగా, వెనకవైపు ఉన్న ఆస్పత్రి సిబ్బందిని చూసిన ఆవు… వారిపై దాడికి చేసేందుకు వాళ్లవైపు తిరిగింది. ఇంతలో తీవ్రంగా గాయపడిన మహిళా పేషెంట్ మెల్లగా లేచి… పక్కనే ఉన్న రూమ్‌లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. ఇక వెయింటింగ్ రూమ్‌లో ఎవరూ లేకపోవడంతో… ఆ ఆవు బయటకు వచ్చింది. ఇదంతా ఆస్పత్రి సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని చదవండి:
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!