Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban: మాదే రాజ్యం ! కాబూల్ లోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు

కాబూల్ నగరాన్ని ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఈ సిటీలోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను మాత్రం వదలని వారు-ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు...

Taliban: మాదే రాజ్యం ! కాబూల్ లోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు
Talibans Enjoy Amusement Parks In Kabul
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 17, 2021 | 2:07 PM

కాబూల్ నగరాన్ని ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఈ సిటీలోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను మాత్రం వదలని వారు-ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై ‘స్వారీ’ చేస్తూ వీళ్ళు కనిపించారు.నగర విమానాశ్రయంలో ఓ వైపు కనబడిన విమానమల్లా ఎక్కేందుకు పరుగులు తీస్తున్న ప్రజలతో విపరీతమైన రద్దీ, గందరగోళం ఏర్పడుతుండగా మరో వైపు వీళ్ళలో కొంతమంది ఇలా పార్కుల బాట పట్టడం విశేషం. వీరిలో కొందరు ఫైటర్లు దేశంలో చిక్కుబడిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట. భాషా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ట్రాన్స్ లేటర్లుగా మారి ఆ సమస్యను తీర్చారట.. బహుశా ఈ కారణం వల్ల కూడా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాలిబన్ల పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారని భావించవలసి వస్తుందంటున్నారు. . ఆఫ్ఘన్ లో పరిస్థితికి తాను ఎంతమాత్రం కారకుడు కాదని ఆయన పదేపదే చెబుతున్నారు. ఇలా ఉండగా కాబూల్ లోని పార్లమెంట్ భవనంలో తాలిబన్లు తిష్ట వేసిన దృశ్యాల వీడియోలు, మజారే షరీఫ్ లో మాజీ ఆఫ్ఘన్ సైనికాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో వీరు తిరుగాడుతున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తమకు ఎదురే లేకపోవడంతో కాబూల్ అంతటా ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారు. ప్రజల నుంచి ఆయుధాలను కూడా తీసేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అటు దేశంలో ఇంకా మిగిలిఉన్న మహిళలు, యువతులు తమ భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాల దారుణ అనుభవాలను వారు గుర్తు చేసుకుంటున్నారు.

కాబుల్‌లోని ఓ జిమ్‌లో తాలిబన్లు..

మరిన్ని ఇక్కడ చూడండి : స్మశానంలో పసికందు ఏడుపు..! దగ్గరకి వెళ్లి చుస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Babe Cemetery Viral Video.

 అల్లు అర్జున్ , మహేష్ బాబు సినిమాలకు షాక్.. బడా మూవీలకు తప్పని లీకుల బాధ..:Movie Scenes Leak Video.

 డేంజరస్ ఫుడ్.. ఇవి తింటే అంతే..!ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటున్న నిపుణులు..:Toxic Food Video.

 తాలిబన్ల వెనుక పాక్, చైనా.. తాలిబన్ అరాచకాలకు అద్దం పడుతున్న దృశ్యాలు..:Afghanistan Crisis Live Updates Video.