Ancient Greek Ghost: ఆ ఇంట్లో సంకెళ్లతో దెయ్యం.. రాత్రి అయితే చాలు శబ్దాలు విడిపించమని విన్నపాలు..

Ancient Greek Ghost Story: దేవతలు, దెయ్యాలు ఎప్పుడు మనిషికి ఆసక్తికరమైన విషయాలే.. దెయ్యాల కథలు.. భయపడుతూనే వినడం పిల్లలనుంచి పెద్దల వరకూ ఆసక్తినే. అయితే ఈ దెయ్యాల కథలు వింటూ నిద్రపోకుండా భయపడేవారు ఇంకోసారి మళ్ళీ దెయ్యం కథలను వినమంటూనే.. మళ్ళీ దెయ్యం మాట వింటే ఆసక్తిని కనబరిచే కథలు మనదగ్గరే కాదు ప్రపంచంలో ప్రతిచోటా ఉంటాయి. అటువంటి ఒక కథ సంకెళ్ళ దెయ్యం కథ..

Surya Kala

|

Updated on: Aug 17, 2021 | 9:51 AM

ఏథెన్స్  గ్రీసు  దేశపు రాజధాని. 3,400 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన నగరం. గ్రీకు దేవత ఎథీనా పేరుమీద ఏర్పడిన ఈ నగరంలో   ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందనే కథ ప్రచారంలో ఉండడంతో ఆ ఇంట్లోకి జనం వెళ్ళడానికి భయపడేవారు

1 / 6
అయితే ఇంట్లో ఓ దెయ్యం తిరుగుతుందని తెలియని ఓ వ్యక్తి ఇంటికి అద్దెకు తీసుకున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. మొదటి రోజు రాత్రి ఇంట్లో గొలుసు శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి మెలుకువ వచ్చిన చూసిన వారికి మురికిగా, చిరిగిన దుస్తులు ధరించి, గడ్డంతో ఉన్న వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించాడు.

2 / 6
తన సంకెళ్లను విడిపించమని ఆ కుటుంబ సభ్యులను అడిగేవాడు.. దీంతో కుటుంబ సభ్యులు భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

3 / 6
ఆ నోటా ఈ నోటా దెయ్యం కథ విన్న 'అథెనోడొరస్‌' అనే వ్యక్తి దెయ్యాలు లేవు.. అవన్నీ వట్టి కథలే అని నిరూపించాలని భావించాడు. దీంతో వెంటనే ఆ ఇంట్లోకి దిగాడు. అయితే ఆరోజు రాత్రి మళ్ళీ ఆ సంకెళ్ళ దెయ్యం అతనికి కనిపించి.. తనకు ఈ సంకెళ్లనుంచి విముక్తికలిగించమని అడుగుతున్న మాటలు వినిపించాయి.

4 / 6
దీంతో ఓ రోజు రాత్రి అథెనోడొరస్‌ శబ్దం వస్తున్న చోటకు వెళ్ళాడు. ఆ సౌండ్ నడుస్తూ వెళ్తుండడంతో.. దానిని ఫాలో అవుతూ.. అలా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు.అక్కడ భూమిలో కాళ్ళు చిక్కుకున్న ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను మళ్ళీ  అథెనోడొరస్‌ ను తనని విడిపించమని రిక్వెస్ట్ చేశాడు.

5 / 6
ఆ స్థలాన్ని గుర్తు పెట్టుకున్న  అథెనో మర్నాడు ఉదయం అక్కడ తవ్వకాలు జరిపాడు. అక్కడ ఓ కుళ్ళిన శవం వెలుగులోకి వచ్చింది. తర్వాత శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆ ఇంట్లో ఎప్పుడు సంకెళ్ళ దెయ్యం కనిపించలేదు. శబ్దాలు వినిపించలేదు.

6 / 6
Follow us