ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు బానిస సంకెళ్లను తెగగొట్టారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆఫ్ఘన్ లో ‘మెంటల్ స్లేవరీ'(మానసిక బానిసత్వ) సంకెళ్లను వారు పగులగొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తరాలుగా వస్తున్న సాంస్కృతిక పరమైన బానిసత్వ సంకెళ్లను తెగగొట్టడం అంత సులభం కాదని, కానీ వాళ్ళు ఆ పని చేశారని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఇదే జరిగిందన్నారు. అంటే ఇమ్రాన్ ప్రభుత్వం ఇక ఆ దేశంలో రేపో మాపో ఏర్పడబోయే తాళిబన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తుందని అర్థమవుతోంది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన.. తాలిబన్లు సాధారణ ప్రజలవంటి వారేనని వ్యాఖ్యానించారు.అటు- ఇస్లామాబాద్ లో సింగిల్ నేషనల్ కరిక్యులమ్ ని లాంచ్ చేసిన సంర్భంగా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. పాక్ లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయని, ఇది ఇతరుల కల్చర్ ని ఎడాప్ట్ చేసుకోవడానికి దారి తీస్తోందని పేర్కొన్నారు. ఒకసారి ఆ కల్చర్ కి అలవాటు పడ్డాక ఇక మనమే సుపీరియర్ అని భావిస్తామని, అది బానిసత్వం కన్నా దారుణమైనదని అన్నారు.
ఇలా ఉండగా ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని నాలుగు కార్ల నిండా డబ్బు సంచులు వేసుకుని కాబూల్ నుంచి పరారయ్యాడని రష్యన్ ఎంబసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితో మొదట తజికిస్థాన్ వెళ్లగా ఆయనకు ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించిందని, దాంతో ఒమన్ చేరుకున్నాడని ఆ ప్రతినిధి చెప్పారు. ఈ సొమ్మును హెలీకాఫ్టర్లో నింపడానికి యత్నించగా అది సరిపోకపోవడంతో మిగిలిన సొమ్మును రన్ వే పైనే వదిలివేశారని ఆయన వెల్లడించాడు. ఘని వెంట ఆఫ్ఘన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు హమ్ దుల్లా మొహిబ్ కూడా ఉన్నారు.
ఘని ఇక అమెరికాలో సెటిల్ కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
“It is more difficult to free your mind from mental slavery, Afghans have broken the shackles of slavery”, PM Imran Khan pic.twitter.com/zpWr6YTYVh
— Alina Shigri (@alinashigri) August 16, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.