Sunita Williams: ఆల్ ఈజ్ నాట్ వెల్.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన..!

| Edited By: Janardhan Veluru

Aug 14, 2024 | 3:54 PM

బోయింగ్ ఏం ప్రకటన చేస్తుందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. 2025 ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్, విల్ మోర్ రాకపోతే వాళ్ల ఆరోగ్యపరిస్థితిపైనే ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంంది. ముఖ్యంగా అక్కడ ఛాలెంజింగ్‌గా ఉండే వాతావరణంపై.. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ ఎదుర్కొనే సోలార్ రేడియేషన్‌ ప్రభావం ఆందోళనకు గురిచేస్తోంది.

Sunita Williams: ఆల్ ఈజ్ నాట్ వెల్.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన..!
Follow us on

ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్‌ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు .. ఈ రోజు వస్తారు.. రేపొస్తారని అని భావించినా.. చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదన్న వార్త విన్నాక అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈ కీలక మిషన్‌పై  బోయింగ్.. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.30 నిమిషాలకు ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటనపైనే ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది. ప్రధానంగా 2025 ఫిబ్రవరి వరకు వచ్చే అవకాశం లేదన్న ప్రకటన విషయంలో ఏదైనా మార్పు ఉంటుందా..? ఒక వేళ ఉంటే ఎప్పుడు భూమిపైకి వస్తారు..? ఒక వేళ అక్కడే ఉండాల్సి వస్తే… ఏం చెయ్యనున్నారు.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. బోయింగ్ ఏం ప్రకటన చేస్తుందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. 2025 ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్, విల్ మోర్ రాకపోతే వాళ్ల ఆరోగ్యపరిస్థితిపైనే ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అక్కడ ఛాలెంజింగ్‌గా ఉండే వాతావరణం.. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ ఎదుర్కొనే సోలార్ రేడియేషన్‌ ప్రభావం వారి క్షేమం పట్ల తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. Sunita Williams,...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి