సుధామూర్తితో మీట్ అండ్ గ్రీట్ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన కిలేడీలు.. కేసు నమోదు

|

Sep 25, 2023 | 10:46 PM

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక్కో టిక్కెట్టును 40 డాలర్లకు (రూ.3,320) విక్రయించి డబ్బులు వసూలు చేశారు. ఆ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్న సుధామూర్తి, తనకు తెలియకుండానే తనతో మీట్ అండ్ గ్రీట్ ఏంటని ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుధామూర్తితో మీట్ అండ్ గ్రీట్ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన కిలేడీలు.. కేసు నమోదు
Sudha Murthy
Follow us on

సుధామూర్తి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య, ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు, బ్రిటన్ ప్రధానికి స్వయానా అత్తగారు ఇలా సుధామూర్తికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సుధామూర్తి పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతుంటారు. అలాంటి సుధామూర్తి పేరు చెప్పి విదేశీయులను మోసం చేసిన ఇద్దరు మహిళలపై బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుధామూర్తి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమతా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు లావణ్య, శృతి అనే ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘మీట్ అండ్ గ్రీట్ విత్ డా.’ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు సుధామూర్తి సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధామూర్తి పాల్గొంటారని సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక్కో టిక్కెట్టును 40 డాలర్లకు (రూ.3,320) విక్రయించి డబ్బులు వసూలు చేశారు. ఆ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్న సుధామూర్తి, తనకు తెలియకుండానే తనతో మీట్ అండ్ గ్రీట్ ఏంటని ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రుతి ఈ మోసానికి పాల్పడిందని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి టిక్కెట్లు అమ్ముకుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

మరో స్కామ్..
ఉత్తర కాలిఫోర్నియాలో ఒక కార్యక్రమానికి సుధామూర్తిని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో తాను పాల్గొనలేకపోతున్నానంటూ ఈ-మెయిల్ ద్వారా నిర్వాహకులకు సందేశం పంపారు సుధామూర్తి. ఇంతలో సుధామూర్తి సోషల్ మీడియాలో ఓ ఫోటో ప్రకటన ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారని ఇటీవల తెలిసింది. దాంతో సంబంధిత కార్యక్రమం నిర్వాహకులను విచారించగా.. లావణ్య అనే వ్యక్తి సుధామూర్తి సన్నిహితురాలినని చెబుతూ ఆమెకు ఫోన్ చేయగా.. తాను కార్యక్రమానికి వస్తానని సుధామూర్తి కన్ఫర్మ్ చేశారని తెలిసింది. దాంతో సుధామూర్తి పేరును దుర్వినియోగం చేసి మోసం చేసిన శృతి, లావణ్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై ఫ్రాడ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..