Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ చేతికి ఐఫోన్‌ 15.. ఫీచర్స్‌కు ఫిదా

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ చేతికి ఐఫోన్‌ 15.. ఫీచర్స్‌కు ఫిదా

Phani CH

|

Updated on: Sep 25, 2023 | 7:52 PM

టెక్ దిగ్గజం యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15 మోడళ్లు సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన యూజర్లు అద్భుతమైన ఫీచర్లకు ఫిదా అవుతున్నారు. సెప్టెంబర్‌ 22నే ప్రపంచవ్యాప్తంగా దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్‌ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఐఫోన్‌ను ఎందుకు కొంటున్నారో కొందరు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూసి ఐఫోన్ 15 కొనుగోలు చేయాలని కోరిక చాలా మందిలో కలుగుతోంది.

టెక్ దిగ్గజం యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15 మోడళ్లు సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసిన యూజర్లు అద్భుతమైన ఫీచర్లకు ఫిదా అవుతున్నారు. సెప్టెంబర్‌ 22నే ప్రపంచవ్యాప్తంగా దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్‌ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఐఫోన్‌ను ఎందుకు కొంటున్నారో కొందరు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూసి ఐఫోన్ 15 కొనుగోలు చేయాలని కోరిక చాలా మందిలో కలుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ X యజమాని ఎలాన్ మస్క్ కూడా మనసు పారేసుకున్నాడట! ఈ దిగ్గజ వ్యాపారవేత్త మస్క్.. ఒక ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఫోన్ 15 సిరీస్ కెమెరా క్వాలిటీతో పాటు కెమెరా స్పెసిఫికేషన్లకు మస్క్ ఫిదా అయ్యారట. మస్క్ 2022లో Xని కొనుగోలు చేశారు. ఆ తర్వాత యాపిల్‌తో అంటీ ముట్టనట్లే ఉన్నారు. 2022, నవంబర్ నెలలో యాపిల్ Xలో ప్రకటనలను నిలిపివేసిందని ఆరోపించారు. ఇలా ప్రశ్నించిన మరి కొద్ది రోజులకే మస్క్ టిమ్ కుక్‌ను యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో కలుసుకున్నారు. తాజాగా యాపిల్ ఫోన్‌పై ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదేళ్ల బాలుడి సమయస్పూర్తి.. తప్పిన పెను ప్రమాదం

Ram Pothineni: నువ్వేమైనా పెద్ద ఫిగర్‌వా !! శ్రీలీలపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్

శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లాలనుకున్నాడు.. చివరికి ??

Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్​ క్యూట్​కపుల్..

రక్తపు మడుగులో బాలుడు.. శరీరంపై ఎలుకలు కొరికిన గాయాలు !!