Earthquake in East Japan : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి జపాన్‌లోని తూర్పు ప్రాంతలో భారీగా ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.3 నమోదైంది. మియాగి, ఫకసిమా, టొహోకు ప్రాంతంలో భూకంప ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదీ జపాన్‌లో రెండో అత్యంత భారీ భూకంపమని అధికారులు తెలిపారు. అక్కడి సమయం ప్రకారం రాత్రి 11.08 గంటలకు 4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే చాలామంది గాయపడ్డట్లు సమాచారం. ప్రాణ, ఆస్థి నష్టంపై ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. తాజాగా సంభవించిన భూకంపంతో సునామీ హెచ్చరికలు మాత్రం జారీచేయలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని ప్రధాని యోషిహిడే సుగా సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ముందుగా భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు యూఎస్ జియలాజికల్ సర్వే వెల్లడించింది.
Also Read: