Srilanka Protest: శ్రీలంకలో పాలకులపై జనం తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపిన సైన్యం
Srilanka Protest: శ్రీలంకలో సంక్షోభం కొనసాగుతోంది. సంక్షోభంలో చిక్కుకున్న జనాలు పాలకులపై తిరగబడుతున్నారు. ఆంక్షలను ధిక్కరించి ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియాపై..
Srilanka Protest: శ్రీలంకలో సంక్షోభం కొనసాగుతోంది. సంక్షోభంలో చిక్కుకున్న జనాలు పాలకులపై తిరగబడుతున్నారు. ఆంక్షలను ధిక్కరించి ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియాపై బ్యాన్ ((Social Media Ban)విధించడాన్ని తప్పుపడుతున్నారు శ్రీలంక ప్రజలు. శ్రీలంకలో ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీధుల్లోకి వస్తున్నారు. ఆహారం, గ్యాస్, పెట్రోల్ కొరతపై ఉద్యమబాట పట్టారు. రాజధాని కొలంబో (Colombo)తో సహా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. క్యాండీలో విద్యార్థులు (Student) పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. గొటబయా రాజపక్సే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు స్టూడెంట్స్. రాజపక్సే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీకెండ్ కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చిన విద్యార్ధులపై తమ ప్రతాపం చూపించారు పోలీసులు. భాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళనలను అదుపు చేయడానికి వాటర్ కెనాన్లను ఉపయోగించారు.
ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరెంట్ కోతలకు నిరసనగా కొలంబోలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొలంబోలో నిషేధాజ్ఞలను ధిక్కరించి 100 మంది విపక్ష నేతలు నిరసన ర్యాలీ తీశారు. అధ్యక్ష భవనం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష నేతలు. అటు ఆందోళనలను అణచివేయడానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. సోషల్‌మీడియాపై లంకలో బ్యాన్ విధించారు.
వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం విధించారు రాజపక్సే. 14 గంటల కరెంట్ కోతలతో అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. పరిస్థితులను చక్కదిద్దాల్సిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే, తన ప్రతాపాన్ని జనం మీద చూపిస్తున్నారు. ఆర్మీకి అన్ని అధికారాలను ఇచ్చేశారు. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆర్మీ సైనికులు. నిత్యాసవర వస్తువుల కొరతను తీర్చడంలో శ్రీలంక పూర్తిగా విఫలమయ్యిందనే విమర్శలను ఎదుర్కొంటున్నారు రాజపక్సే. అటు శ్రీలంకకు భారీ సాయం చేసింది భారత్.
ఇవి కూడా చదవండి: