AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: అక్కడ మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. లాక్‌డౌన్‌ విధిస్తున్నా తగ్గని కేసులు..!

Coronavirus: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. అటు ఆంక్షల నేపథ్యంలో తీవ్ర అవస్థలు..

Coronavirus: అక్కడ మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. లాక్‌డౌన్‌ విధిస్తున్నా తగ్గని కేసులు..!
Subhash Goud
|

Updated on: Apr 04, 2022 | 6:56 AM

Share

Coronavirus: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. అటు ఆంక్షల నేపథ్యంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. చైనాలో అతిపెద్ద నగరం షాంఘై (Shanghai)లో కఠినమైన లాక్​డౌన్‌ (Lockdown)ను అమలు చేస్తున్నారు అధికారులు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టినా కేసులు తగ్గకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్‌​కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. అయినా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. షాంఘైలో తాజాగా 438 కొత్త పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. లక్షణాలు లేకుండా మరో 7,788 మంది కొవిడ్​ బారినపడ్డారు. 2.6 కోట్ల జనాభా ఉన్న షాంఘై నగరంలో చైనా (China) గతవారం రెండు దశల లాక్​డౌన్‌ను అమలు చేసింది. షాంఘైలో హువాంగ్​పూ నదికి తూర్పువైపున ఉన్న పుడోంగ్ ప్రాంతం ఇటీవల తెరుచుకుంది.

పశ్చిమాన ఉన్న పుక్సీలో లాక్‌డౌన్‌​అమల్లోకి వచ్చింది. అయితే అన్నీ అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, పుడోంగ్‌లో కోట్లాది మంది ప్రజలు మందులు, ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి లభ్యత, లాక్​డౌన్​పై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలకు క్షమాపణలు చెప్పారు అధికారులు. సాధ్యమైనంత తక్కువ సమయంలో కొవిడ్​ 19 అరికట్టడానికి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే జీరో కొవిడ్‌గా చైనా మారాలంటే లాక్‌డౌన్‌​, కొవిడ్ పరీక్షలు చేయడం తప్పదని స్పష్టం చేస్తున్నారు అధికారులు. కరోనా మహమ్మారి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో షాంఘైలో లాక్‌డౌన్ విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అత్యవసరాలు మినహా మిగతా కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. ఇక్కడ లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందని గతంలో ఆలోచించారు అధికారులు. కానీ, కేసులు పెరగడంతో లాక్‌డౌన్ విధించక తప్పలేదు. ఇప్పుడు చైనాలో కరోనా విజృంభిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు.

ఇవి కూడా చదవండి:

Pakistan Crisis: అతని వల్లే పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..!

Covid 19 New Variant: వేగంగా దూసుకొస్తున్న మరో కొత్త వేరియంట్.. బ్రిట‌న్‌లో వెలుగుచూసిన ఎక్స్ఈః డ‌బ్ల్యూహెచ్‌వో