Pakistan Crisis: అతని వల్లే పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..!
పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విదేశీ కుట్ర పన్నుతున్నట్లు ఆరోపిస్తున్న ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా అమెరికా దౌత్యవేత్త పేరును బయటపెట్టారు.
Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విదేశీ కుట్ర పన్నుతున్నట్లు ఆరోపిస్తున్న ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తొలిసారిగా అమెరికా(America) దౌత్యవేత్త పేరును బయటపెట్టారు. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ(US Diplomat Donald Lu) కుట్ర పన్నారని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. డోనాల్డ్ డో US స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని దక్షిణ మధ్య ఆసియా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఈరోజు పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. డొనాల్డ్ లూ చెప్పిన దాని వెనుక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఉన్నారని ధ్వజమెత్తారు.
అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈరోజు తన తొలి ప్రకటన చేశారు. నేషనల్ అసెంబ్లీ నిర్ణయం ప్రతిపక్షాలను ఆశ్చర్యపరిచాయన్న ఆయన.. విపక్షాలకు ఏం జరిగిందో అర్థం కావడం లేదని.. ఈ సమయంలో విపక్షాల నుంచి విదేశీ దౌత్యవేత్తలు ఎందుకు రాబడుతున్నారని ప్రశ్నించారు.
పాకిస్థాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘నేషనల్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని ఏ కోర్టులోనూ సవాలు చేయలేం.. స్పీకర్‌కి, డిప్యూటీ స్పీకర్‌కి సెల్యూట్ చేస్తున్నాను.. ఎందుకు ప్రతిపక్షాలు ఎన్నికల అంటే పారిపోతున్నాయి.. రాజకీయ పార్టీగా ఉండి భయానికి బలికావడం ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయండి.. అంటూ ప్రతిపక్షాలకు మంత్రి ఫవాద్ చౌదరి హితవు పలికారు.
ఇదిలావుంటే, జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి, ప్రధానమంత్రిని తొలగించేందుకు ప్రతిపక్షాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ తిరస్కరించారు. ఆ తర్వాత పార్లమెంట్‌ను రద్దు చేయాలని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ప్రధాని సిఫార్సును అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించారు.
Read Also… Indian Economy: భారతీయ ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!