Sri Lanka: విద్యుత్‌ సంక్షోభంతో శ్రీలంక.. సాంకేతిక సమస్యతో అంధకారంలో లంక..

|

Dec 10, 2023 | 7:29 AM

ఇంట్లో కొద్దీ సేపు విద్యుత్ లేకపోతేనే అల్లాడిపోతాం.. మరి అలాంటిది ఏకంగా దేశం మొత్తం పవర్‌ కట్ అంటే.. అప్పుడు ఆ దేశంలోని పరిస్థితి ఎలా ఉంటుందో.. తాజాగా ఒక్కసారిగా ఏర్పడిన పవర్ కట్ తో  శ్రీలంకను అంధకారంలోకి నెట్టింది. సాంకేతిక సమస్యతో లంకలో చీకట్లు అలుముకున్నారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Sri Lanka: విద్యుత్‌ సంక్షోభంతో శ్రీలంక.. సాంకేతిక సమస్యతో అంధకారంలో లంక..
Nationwide Power Cut In Srilanka
Follow us on

ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంకను విద్యుత్‌ సమస్య కూడా చుట్టు ముట్టింది.  విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్య ఏర్పడడటంతో మొత్తం దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయంపై సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక ప్రకటన చేసింది. ఈ బోర్డు దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వంటి వాటిని పర్యవేక్షిస్తుంది. అయితే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి.

కాట్‌మలే,  బియగమా మధ్య  మెయిన్ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లలో సమస్య ఏర్పడిందని.. అందుకనే దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తిందని తెలుస్తోంది.  వాస్తవానికి శ్రీలంక 2022 నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలకు  కూడా కొరత ఏర్పడింది. దీంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతోంది. ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది.

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీలంకలో విద్యుత్‌ కోతలు సర్వసాధారణమయ్యాయి. అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా రోజులో దాదాపు 10 గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. రాత్రి పూట పవర్‌కట్‌తో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులకు ప్రతికూల పరిస్థితులున్నాయి. ప్రభుత్వం, అధికారులు విద్యుత్‌పై సైలెంట్‌గా ఉన్నారంటూ ప్రజలు మండి పడుతున్నారు. వెంటనే విద్యుత్‌ సంక్షోభాన్ని చక్కదిద్దాలని డిమాండ్‌ చేస్తున్నారు జనం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..