శ్రీలంక పేలుళ్లు: అన్నాచెల్లెళ్లను వదలని మరణమృదంగం

ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో విషాదాన్ని నింపాయి. ప్రార్థనలు చేసేందుకు చర్చ్‌కు వెళ్లిన ఆ దేశీయులే కాదు.. విహారయాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు విదేశీయులు ఈ పేలుళ్లలో తమ ప్రాణాలను కోల్పోయారు. వందలమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ కాల్పుల్లో బ్రిటన్‌కు చెందిన అన్నాచెల్లెళ్లను మృత్యుదేవత వెంటపడింది. ఒకచోట తప్పించుకున్నప్పటికీ.. మరోచోట తోబుట్టువులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్లే.. బ్రిటన్‌కు చెందిన డేనియల్(19), సోదరి […]

శ్రీలంక పేలుళ్లు: అన్నాచెల్లెళ్లను వదలని మరణమృదంగం
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 1:32 PM

ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో విషాదాన్ని నింపాయి. ప్రార్థనలు చేసేందుకు చర్చ్‌కు వెళ్లిన ఆ దేశీయులే కాదు.. విహారయాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు విదేశీయులు ఈ పేలుళ్లలో తమ ప్రాణాలను కోల్పోయారు. వందలమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ కాల్పుల్లో బ్రిటన్‌కు చెందిన అన్నాచెల్లెళ్లను మృత్యుదేవత వెంటపడింది. ఒకచోట తప్పించుకున్నప్పటికీ.. మరోచోట తోబుట్టువులు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్లే.. బ్రిటన్‌కు చెందిన డేనియల్(19), సోదరి అమీలీ(15) తమ తల్లిదండ్రులతో కలిసి విహారయాత్ర కోసం శ్రీలంకకు వెళ్లారు. అందులో భాగంగా ఆదివారం ఓ కెఫేలో ఉండగా.. అక్కడ పేలుళ్లు సంభవించాయి. దీంతె వెంటనే అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడి.. కొలంబోలోని ఓ హోటల్‌కు వెళ్లారు. అయితే అక్కడ కూడా పేలుడు సంభవించడంతో డేనియర్, అమీలీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇద్దరూ కన్నుమూశారు. దీంతో డేనియల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 310కు చేరింది.