పేలిపోయిన స్పేస్ రాకెట్.. ఎలన్ మస్క్ ప్లాన్ ఫెయిల్ !
భవిష్యత్తులో అంగారక (మార్స్) గ్రహానికి మానవులను పంపాలని కలలు కంటున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ ఆశలు ఆవిరయ్యేట్టే ఉన్నాయి.తమ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన రాకెట్ టెస్ట్ విఫలమయింది. గత శుక్రవారం రాత్రి ఈ రాకెట్ ని ప్రయోగించేందుకు పూనుకోగా.. లిక్విడ్ నైట్రోజెన్ ఒత్తిడి కారణంగా ఈ స్టార్ షిప్ రాకెట్ మధ్యలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బొకా చికాలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ రాకెట్ లోని స్టెయిన్ లెస్ స్టీల్ సిలిండర్ తన […]
భవిష్యత్తులో అంగారక (మార్స్) గ్రహానికి మానవులను పంపాలని కలలు కంటున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ ఆశలు ఆవిరయ్యేట్టే ఉన్నాయి.తమ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన రాకెట్ టెస్ట్ విఫలమయింది. గత శుక్రవారం రాత్రి ఈ రాకెట్ ని ప్రయోగించేందుకు పూనుకోగా.. లిక్విడ్ నైట్రోజెన్ ఒత్తిడి కారణంగా ఈ స్టార్ షిప్ రాకెట్ మధ్యలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బొకా చికాలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ రాకెట్ లోని స్టెయిన్ లెస్ స్టీల్ సిలిండర్ తన స్టాండ్ నుంచి ఒక్కసారిగా విడిపోయి క్రాష్ అయింది. దీని శిథిలాలు కింద చెల్లాచెదరుగా పడ్డాయి. ఈ విధమైన ప్రయోగం ఫెయిల్ కావడం ఇది రెండో సారి. గత ఏడాది నవంబరులో క్రయోజెనిక్ ప్రెషర్ టెస్ట్ కూడా ఇలాగే విఫలమయింది. దీంతో ఎలన్ మస్క్ కంపెనీ వర్గాల్లో నిరాశా మేఘాలు ఆవరించాయి. అంగారక గ్రహానికి మొదట వ్యోమగాములను తామే పంపుతామని, ఇది తమకే సాధ్యమని ఎలన్ మాస్క్ చాలాసార్లు ప్రకటించుకున్నారు. అయితే భవిష్యత్తులో మళ్ళీ రాకెట్ టెస్టులు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.