Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు.. కాలికి బుల్లెట్ గాయం.. ప్రసంగిస్తుండగా ఘటన..

|

Nov 03, 2022 | 5:53 PM

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరగింది. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఆయనతో పాటు మరో నలుగురికి..

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు.. కాలికి బుల్లెట్ గాయం.. ప్రసంగిస్తుండగా ఘటన..
Imran Khan
Follow us on

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరగింది. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్‌ తో పాటు క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

వజీరాబాద్ లో మాజీ ప్రధాని ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. 2007 లో జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగిన కాల్పులు తీవ్ర సంచలనంగా మారాయి. కాల్పులు జరిగిన తర్వాత గందరగోళ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..