Shinzo Abe Funeral: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలపై వివాదం.. డబ్బు వృధా చేయొద్దంటూ నిరసనలు..

క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల కోసం బ్రిటన్‌ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1.3 బిలియన్‌ యెన్స్‌.. కానీ షింజో అబే అంత్యక్రియల ఖర్చు 1.7 బిలియన్‌ యెన్స్‌ అని అంచనా వేస్తున్నారు. అంటే ఎంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారో ఊహించుకోవచ్చు..

Shinzo Abe Funeral: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలపై వివాదం.. డబ్బు వృధా చేయొద్దంటూ నిరసనలు..
Shinzo Abe Funeral

Updated on: Sep 25, 2022 | 6:05 AM

Shinzo Abe Funeral Expence: బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఎంతో అట్టహాసంగా ముగిశాయి. రాజలాంఛనాలతో జరిగిన ఈ తతంగాన్ని ప్రపంమంతా లైవ్‌ ద్వారా చూసింది. కాగా, జులై 8వ తేదీన హత్యకు గురైన జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే (shinzo abe funeral) అంత్యక్రియలకు సెప్టెంబర్‌ 27న ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ తతంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జపాన్‌ ప్రజలు.. ఏకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటీవలి వరకూ తాము ఎంతో అభిమానించిన నాయకుడు షింజోకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు వీరు ఎందుకు ఇష్టపడటం లేదు? అంటే అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది.

క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల కోసం బ్రిటన్‌ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1.3 బిలియన్‌ యెన్స్‌.. కానీ షింజో అబే అంత్యక్రియల ఖర్చు 1.7 బిలియన్‌ యెన్స్‌ అని అంచనా వేస్తున్నారు. అంటే ఎంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారో ఊహించుకోవచ్చు.. ఈ కాంట్రాక్ట్‌ను టోక్యోకు చెందిన మురయామాఅనే ఈవెంట్ ఆర్గనైజర్‌కు ఇచ్చారు.. ప్రభుత్వ లాంఛనాలతో అత్యక్రియల కోసం ఇంత పెద్ద మొత్తంలో టాక్స్‌ పేయర్స్‌ డబ్బును ఖర్చు చేయడం ఎందుకని జపాన్‌ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఖర్చును వ్యతిరేకిస్తూ ఇటీవల ప్రధాని కిషిడా కార్యాలయం దగ్గర ఓ వ్యక్తి ఆత్మాహుతికి ప్రయత్నించగా, పోలీసులు కాపాడారు.

ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నా, ఎక్కడా తగ్గేదేలేదంటోంది జపాన్‌ ప్రభుత్వం.. జపాన్‌లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిర్వహిస్తున్న రెండో అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ఇదే అంటున్నారు. టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్‌లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది.

ఇవి కూడా చదవండి

కాగా, షింజో అబే అంత్యక్రియల్లో ప్రధాని మోడీతోపాటు పలు దేశాధినేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..