ఐదో సారి..నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ పదవీ యోగం

| Edited By: Anil kumar poka

Jul 13, 2021 | 4:00 PM

నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా మంగళవారం నేపాల్ ప్రధాని అయ్యారు. రాజ్యాంగంలోని 76 (5) అధికరణం కింద ప్రెసిడెంట్ బిద్యాదేవిభండారీ ఆయనను ఈ పదవిలో నియమించారు. 74 ఏళ్ళ దేవ్ బా ఈ దేశ ప్రధాని కావడం ఇది ఐదో సారి. ఇప్పటివరకు ప్రధానిగా..

ఐదో సారి..నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ పదవీ యోగం
Sher Bahadur Deu Ba Appointed As Nepal Pm
Follow us on

నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా మంగళవారం నేపాల్ ప్రధాని అయ్యారు. రాజ్యాంగంలోని 76 (5) అధికరణం కింద ప్రెసిడెంట్ బిద్యాదేవిభండారీ ఆయనను ఈ పదవిలో నియమించారు. 74 ఏళ్ళ దేవ్ బా ఈ దేశ ప్రధాని కావడం ఇది ఐదో సారి. ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న కె.పి.శర్మ ఓలి స్థానే ఆయనను ప్రధాని పదవిలో నియమించాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దేవ్ బా నియామకం గురించి అధ్యక్షురాలి కార్యాలయం కూడా ఓ ప్రకటన చేసింది. కాగా ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది తెలియడంలేదు. దేవ్ బా లోగడ నేపాల్ ప్రధానిగా నాలుగు సార్లు వ్యవహరించారు. 1995-97 మధ్య కాలంలోనూ, 2001-2002, 2004-2005, 2017-2018 మధ్య కాలం లోనూ ఆయన ఈ పదవిలో ఉన్నారు. తాజాగా తన నియామకం జరిగిన 30 రోజుల్లోగా ఆయన సభా విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజేటెంటేటివ్స్) ను రద్దు చేయాలని మాజీ ప్రధాని ఓలి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిన్న తిరస్కరించింది.

దేవ్ బాను ప్రధానిగా నియమించాలని ఆదేశించింది. ఈ పదవికి తానే తగినవాడినన్న ఓలి ప్రకటన రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ చోలేంద్ర షమ్ షేర్ రానా ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అటు-ఈ నెల 18 న ప్రతినిధుల సభను సమావేశపరచేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలన్న దేవ్ బా కోర్కెను ప్రెసిడెంట్ తిరస్కరించడం రాజ్యాంగ వ్యతిరేకమని కూడా కోర్టు పేర్కొంది. ప్రజాస్వామిక విలువలను కాపాడవలసి ఉందని ఈ ధర్మాసనం అభిప్రాయపడింది.

మరిన్ని ఇక్కడ చూడండి : ముంచుకొస్తున్న సౌర తుఫాన్..గతంలో సూర్యుడి ఉపరితలంపై భారీ తుఫాను..:Solar Storm Moving To Earth Live Video.

 ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.

News Watch : రెంటికీ చెడ్డ పాడి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )

 మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021