తోడేళ్లని విపరీతంగా చంపుతున్న స్వీడెన్, నార్వే ప్రజలు.. దీని వెనుక కారణం ఏంటంటే..?

|

Jan 16, 2022 | 8:00 AM

Wolf Culling : ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి అనేక యూరోపియన్ దేశాల ప్రజలు తోడేళ్ళను విపరీతంగా చంపుతున్నారు. స్వీడన్‌లోని

తోడేళ్లని విపరీతంగా చంపుతున్న స్వీడెన్, నార్వే ప్రజలు.. దీని వెనుక కారణం ఏంటంటే..?
Wolf
Follow us on

Wolf Culling : ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి అనేక యూరోపియన్ దేశాల ప్రజలు తోడేళ్ళను విపరీతంగా చంపుతున్నారు. స్వీడన్‌లోని వేటగాళ్లు వార్షిక లక్ష్యాన్ని అధిగమించి ఇప్పటికే 27 తోడేళ్లను కాల్చారు. ఫిన్లాండ్ ప్రభుత్వం వేటలో భాగంగా 20 తోడేళ్ళను చంపడానికి ఆమోదించింది. స్వీడన్‌లో 2020-21 సంవత్సరానికి తోడేళ్ల సంఖ్య 395గా ఉందని ఇప్పుడు ఆ సంఖ్య 300కి తగ్గిందని వన్యప్రాణి వర్గాలు చెబుతున్నాయి. వన్యప్రాణుల స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మాగ్నస్ రీబ్రాంట్ మాట్లాడుతూ.. స్వీడన్‌లో 1000 కంటే ఎక్కువ తోడేళ్లు ఉండే అవకాశం ఉంది. కానీ వారు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు నార్వే ఈ శీతాకాలంలో 60 శాతం తోడేళ్లను చంపేస్తుంది.

సామూహిక వధకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని అనేక పరిరక్షణ సంఘాలు యూరోపియన్ యూనియన్‌ని కోరాయి. పశ్చిమ ఐరోపాలో దేశాలు తోడేళ్లకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని పరిరక్షకులు ఆరోపిస్తున్నారు. ది గార్డియన్‌లోని ఒక నివేదికలో.. జంతు హక్కుల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిరి మార్టిన్సన్ ఇది ఒక భయానక పరిస్థితిగా వర్ణించారు. నార్వే ప్రజలు ఇష్టారీతిన తోడేళ్లని కాల్చివేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి తోడేళ్లంటే కొంతమందికి నచ్చదు. ఇది చాలా అవమానకరం. ఒక జాతిని ప్రమాదకర స్థాయిలో పడేయడం చాలా దురదృష్టకరమని మార్టినన్స్‌ అభిప్రాయ పడ్డారు.

ఇతర దేశాల నుంచి జోక్యం

తోడేళ్ళను చంపడం చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఫిన్లాండ్, స్వీడన్‌లోని వన్యప్రాణుల సమూహాలు యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేశాయి. అయితే రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం చట్టపరంగా ఇలాంటి హత్యలను అనుమతించేలా ప్రోత్సహిస్తోంది. ఈ హత్యలను ఆపడానికి ఇతర యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోవాలని పరిరక్షకులు కోరుతున్నారు. నిజానికి తోడేళ్లను చంపడం ఇలాగే కొనసాగితే త్వరలో తోడేళ్ల జనాభా తగ్గిపోయి ఈ జంతువులు అంతరించిపోయే దశకు చేరుకుంటాయని సంరక్షకులు భయపడుతున్నారు.

IND vs SA U-19 World Cup: సౌతాఫ్రికాపై భారత్‌ సూపర్ విక్టరీ.. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధూల్‌..

China: చైనా నుంచి కొత్త ‘విపత్తు’..! ఇప్పటికే ఇద్దరు మరణం.. WHO హెచ్చరికలు..

ప్రతి నొప్పికి ఔషధం మీ వంటగదిలోనే ఉంది..! కరోనా సమయంలో వాటిని గుర్తించడం అత్యవసరం..