Afghanistan: పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్గనిస్తాన్‌.. 18 మంది మృతి, 65 మందికి పైగా గాయాలు..

|

Apr 21, 2022 | 3:46 PM

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ప్రార్థనా మందిరంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు దాడుల్లో 18 మంది మరణించనగా, 65 మందికిపైనా గాయాలయ్యాయి...

Afghanistan: పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్గనిస్తాన్‌.. 18 మంది మృతి, 65 మందికి పైగా గాయాలు..
Representative Image
Follow us on

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ప్రార్థనా మందిరంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు దాడుల్లో 18 మంది మరణించనగా, 65 మందికిపైనా గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు.
మజార్-ఎ-షరీఫ్ మసీదుతో పాటు.. కాబూల్, నంగర్హర్, కుందుజ్‌లలో కూడా పేలుళ్లు జరిగాయి. మసీదులో పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. కాబుల్‌ సహా ఒకేసారి పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరగడంతో ఆఫ్గనిస్తాన్‌ ఒక్కసారిగా వణికిపోయింది.

ఇదిలా ఉంటే తాలిబన్లు అధికారాన్ని అస్తగతం చేసుకున్న తర్వాత ఆఫ్గనిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్‌ 19న ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. మూడు ప్రదేశాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది స్కూల్‌ విద్యార్ధులు మృతి చెందారు. ఈ బాంబు పేలుళ్ల వేకన ఐసిస్‌ ఉగ్రముఠాల హస్తమున్నట్లు వార్తలు వచ్చాయి.

Also Read: ఐపీఎల్ చరిత్రలో ఫ్లాప్‌గా మారిన అత్యంత ఖరీదైన ఆటగాళ్లు..

మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మరో మహిళతో లవ్.. విషయం తెలిసిన మూడో భార్య ఏం చేసిందంటే..?

Telangana: నమ్మకంగా ఉంటూ చిన్నారిని చెరబట్టాడు.. బాలికపై వృద్ధుడి అఘాయిత్యం