US Drone Strike: అమెరికా డ్రోన్‌ దాడి.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా అగ్రనేత హతం..!

|

Oct 23, 2021 | 10:39 AM

US Drone Strike: అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్‌ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి..

US Drone Strike: అమెరికా డ్రోన్‌ దాడి.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా అగ్రనేత హతం..!
Follow us on

US Drone Strike: అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్‌ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతమయ్యాడని అమెరికా ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ వెల్లడించారు. దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని హతమార్చడం ద్వారా ఉగ్ర సంస్థలు మరింతగా కుట్ర పన్నేందుకు, ప్రపంచ దాడులకు పాల్పడే సామర్థ్యం దెబ్బతింటుందని అన్నారు.

ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల్లోనే డ్రోన్‌ దాడి..
కాగా, దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన రెండు రోజుల్లోనే ఈ డ్రోన్‌ దాడి జరిగడం గమనార్హం. అయితే ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందా..? లేదా అనే విషయాన్ని అమెరికా ప్రకటించలేదు. కాగా, సెప్టెంబర్‌ చిరరలో పెంటగాన్‌ వాయువ్య ప్రాంతంలో ఇడ్లిబ్‌ సమీపంలో వైమానిక దాడిలో సిరియాలోని మరొక సీనియర్‌ అల్‌-ఖైదా కమాండర్‌ సలీం అబూ-అహ్మద్‌ను హతమార్చింది.

ఇవీ కూడా చదవండి:

Coconut Trees: ఏపీలో ఘోరం.. ప్రత్యర్థి పార్టీకి మద్దతిచ్చాడని కొబ్బరితోటలో వంద చెట్లు నరికి విధ్వంసం

Trekkers: పర్వతారోహణకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. తప్పిపోయిన ట్రెక్కర్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ..