‘యూనివర్సల్ వ్యాక్సిన్’ సృష్టికి శాస్త్రజ్ఞుల ముమ్మర పరిశోధనలు……భవిష్యత్తులో ఫలించేనా …?

| Edited By: Phani CH

Jun 23, 2021 | 9:04 PM

కోవిద్-10 కొత్త వేరియంట్ .ప్రపంచ దేశాలను అప్పుడే హడలెత్తిస్తున్న తరుణంలో శాస్త్రజ్ఞులు, రీసెర్చర్లు వివిధ రకాల వైరస్ లను కట్టడి చేయగలిగే యూనివర్సల్ వ్యాక్సిన్ ని అభివృద్ధి పరచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

యూనివర్సల్ వ్యాక్సిన్ సృష్టికి శాస్త్రజ్ఞుల ముమ్మర పరిశోధనలు......భవిష్యత్తులో ఫలించేనా ...?
Develop Universal Vaccine
Follow us on

కోవిద్-10 కొత్త వేరియంట్ .ప్రపంచ దేశాలను అప్పుడే హడలెత్తిస్తున్న తరుణంలో శాస్త్రజ్ఞులు, రీసెర్చర్లు వివిధ రకాల వైరస్ లను కట్టడి చేయగలిగే యూనివర్సల్ వ్యాక్సిన్ ని అభివృద్ధి పరచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇది తుది దశలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ సిద్ధమైన పక్షంలో భవిష్యత్తులో అన్ని రకాల హానికారక వైరస్ లను ఎదుర్కొనే శక్తిమంతమైన ‘ఆయుధం’ లభించగలదని భావిస్తున్నారు. తాము డెవలప్ చేస్తున్న టీకామందును ఎలుకలపై ప్రయోగించి చూడగా అవి తమ రోగ నిరోధక శక్తిని పెంచుకున్నాయని….కోవిద్-19 వైరస్ ను కూడా హరింప జేసుకున్నాయని వారు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరొలినాకు చెందిన రీసెర్చర్లు ఈ విషయాలను చెబుతూ……తమ ప్రయోగాలు ఫలించగలవని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం దీన్ని హైబ్రిడ్ వ్యాక్సిన్ గా వ్యవహరిస్తున్నామని, అయితే ఆ తరువాత దీని పేరు మారవచ్చునని వారు పేర్కొన్నారు. ఎలుకలపైనే కాకుండా ఇతర జంతువులపై కూడా తాము ఈ టీకామందును పరీక్షించి చూస్తున్నట్టు ఈ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.

వచ్చే ఏడాది దీన్ని మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సూచనలు ఉన్నాయని, కానీ తమ పరిశోధనలు ఇంకా పూర్తి కావడానికి మరి కొంత కాలం పడుతుందని డేవిడ్ మార్టినెజ్ అనే శాస్త్రజ్ఞుడు తెలిపారు. ఇప్పటివరకు మనం సార్స్-కొవ్-2 ని ఎదుర్కొనే వ్యాక్సిన్ ని మాత్రమే చూశామని కానీ తమ టీకామందును సార్స్-కొవ్-3 ని కూడా ఎదుర్కొనే మందుగా సైతం పేర్కొనవచ్చునని ఆయన అన్నారు. నిజంగా ఈ శాస్త్రజ్ఞుల రీసెర్చ్ ఫలించి ఈ యూనివర్సల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన పక్షంలో ప్రపంచ మానవాళికి అంతకన్నా కావలసింది ఏముంటుంది…?

 

మరిన్ని ఎక్కడ చూడండి: Potina Venkata Mahesh : ‘ఈ డ్రామాలేంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారూ.. వాటిపై మీకు రాజకీయం తగునా?’ : జనసేన ప్రతినిధి పోతిన

Acharya: అంతుబట్టని ‘ఆచార్య’ మూమెంట్స్‌.. రిలీజ్ డేట్‌పై మెగాఫ్యాన్స్‌ని వెంటాడుతున్న సందేహాలు !