Sadiq Khan: లండ‌న్ మేయ‌ర్‌గా పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ఎన్నిక.. వరుసగా రెండోసారి..

London Mayor Sadiq Khan: లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ రెండోసారి ఎన్నికయ్యారు. పాకిస్తాన్ సంతతికి చెందిన 51 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ నుంచి

Sadiq Khan: లండ‌న్ మేయ‌ర్‌గా పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ఎన్నిక.. వరుసగా రెండోసారి..
London Mayor Sadiq Khan

Updated on: May 10, 2021 | 10:15 AM

London Mayor Sadiq Khan: లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ రెండోసారి ఎన్నికయ్యారు. పాకిస్తాన్ సంతతికి చెందిన 51 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే లేబర్ పార్టీ తరుపున సాదిక్ ఖాన్‌ విజయం సాధించడంతో ఆపార్టీ కొంత ఊరట లభించినట్లయింది. సాదిక్ ఖాన్ 2016 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి బ్రిటన్ రాజధాని న‌గ‌రం లండన్‌కు తొలి ముస్లిం మేయర్‌గా పదవి చేపట్టారు. ఈసారి ప్రధాన ప్రత్యర్థి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన షాన్ బెయిలీని ఓడించి మ‌రీ రెండో సారి లండ‌న్ మేయ‌ర్ పీఠాన్ని దక్కించుకున్నారు. లేబర్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన సాదిక్‌ ఖాన్ 55.2 శాతం ఓట్లు సాధించగా, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి బెయిలీకి 44.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే, ఈసారి ఖాన్ గతం కంటే తక్కువ ఓట్లతో గెలిచారు. ఈ సందర్భంగా సాధిక్ ఖాన్ మాట్లాడుతూ.. ఉపాధి కల్పించడంతోపాటు లండన్ పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంపై దృష్టి సారించ‌నున్న‌ట్లు ఖాన్‌ పేర్కొన్నారు. భూమిపై అతిపెద్ద నగరాన్ని ముందుకుతీసుకెళ్లేందుకు లండన్ వాసులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడించారు. క‌రోనా వైర‌స్ చీకటి రోజుల తర్వాత లండన్ కోసం మంచి, ప్రకాశవంతమైన భవిష్యత్‌ను సృష్టిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సాదిక్‌ ఖాన్, బోరిస్ జాన్సన్ పాలనలో… బ్రిటిష్ రాజధాని నాయకుడిగా నియమితులయ్యారు. దాదాపు తొమ్మిది లక్షల జనాభా ఉన్న ఈ నగరం.. బ్రిటన్‌లో హింసకు ప్ర‌ధాన‌ కేంద్రంగా ఉండటం క‌ల‌వ‌రానికి గురిచేస్తుంది.

Also Read:

Cyber Attack: అమెరికాలో సైబర్ అటాక్ కలకలం.. ప్రధాన ఇంధన పైప్‌లైన్‌ నిలిపివేత

America Firing: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం