Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు మరింత దూకుడుగా..

|

Jul 03, 2022 | 7:42 PM

ఈ రెండు దేశాల యుద్ధం అంత‌ర్జాతీయంగా అనేక దేశాల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. ప్ర‌పంచ దేశాలు హెచ్చ‌రిస్తూ.. ఇప్ప‌టికే ర‌ష్యా పై అనేక ఆంక్ష‌లు విధించిన వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు మరింత దూకుడుగా..
Ukrainian Held City
Follow us on

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ర‌ష్యాన్‌ సేన‌లు ఉక్రెయిన్ పై విరుచుకుప‌డుతున్నాయి. ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం కార‌ణంగా ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఉక్రెయిన్ లోని న‌గ‌రాలు శిథిలాల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఈ రెండు దేశాల యుద్ధం అంత‌ర్జాతీయంగా అనేక దేశాల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. ప్ర‌పంచ దేశాలు హెచ్చ‌రిస్తూ.. ఇప్ప‌టికే ర‌ష్యా పై అనేక ఆంక్ష‌లు విధించిన వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్‌కు కీలకమైన లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ‘‘రష్యా దళాలు, లూహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ యూనిట్లు లిసిచాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శత్రువును పూర్తి స్థాయిలో తరిమి కొట్టి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి” అని తన ప్రకటనలో పేర్కొంది.

రష్యాకు సరిహద్దుగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతం డోన్బాస్ ను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. డోన్బాస్ లోని లూహాన్స్క్, డోనెట్స్స్ రీజియన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ ఇప్పటికే రష్యా మద్దతుతో వేర్పాటు వాదులు ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలపై పోరాడుతున్నారు. వారితోపాటు రష్యా కూడా పెద్ద సంఖ్యలో దళాలతో కలిసి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటోంది. మరోవైపు ఉక్రేనియన్ యోధులు రష్యా ఆక్రమణ నుండి నగరాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పొరుగున ఉన్న స్వయారోడోనెట్స్క్ ప్రాంతాన్ని ఇప్పటికే ఒక వారం క్రితం రష్యా స్వాధీనం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి