Pakistan: పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19మంది దుర్మరణం

పాకిస్తాన్ (Pakistan) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ఓ లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30..

Pakistan: పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19మంది దుర్మరణం
Pakistan Bus Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 04, 2022 | 2:46 AM

పాకిస్తాన్ (Pakistan) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ఓ లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందుకున్నారు. పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుుకని సహాయకచర్యలు చేపట్టారు. ఇస్లామాబాద్ (Islamabad) నుంచి క్వెట్టా (Kwetta) వస్తున్న బస్సు క్వెట్టా సమీపంలోకి రాగానే ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది. లోయలోకి దూసుకెళ్లి పడిపోయింది. అతివేగం, భారీ వర్షమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

బస్సు ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..