Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..

|

Feb 25, 2022 | 5:55 PM

అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలపై రష్యా భగ్గుమంది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తామని హెచ్చరించింది. స్పేస్ స్టేషన్‌ను యూరోప్‌ దేశాలు, అమెరికాపై కూల్చేస్తే మీకు ఓకేనా అని ప్రశ్నించారు..

Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..
Putin Warning
Follow us on

ప్రపంచమంతా ముక్తకంఠంతో వద్దని వారించినా యుద్ధానికే సై అంది రష్యా(Russia). అయితే సైనికపరంగా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్న ప్రపంచ దేశాలు ఫైనాన్షియల్‌ వార్‌(War) ప్రకటిస్తున్నాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలను వదులుకోవడానికి సిద్దమవుతున్నాయి అగ్రదేశాలు. అమెరికా(USA) నుంచి ఆస్ట్రేలియా వరకూ ఆంక్షలు విధించాయి అగ్రదేశాలు. ఊహించని యుద్ధంతో జరగబోయే నష్టాన్ని అంచనా వేయడం కష్టమంటున్నారు నిపుణులు. అమెరికా, యూకే, యూరోప్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి. వ్యాపార – వాణిజ్యం వదులుకుంటున్నాయి. యూరప్‌ సుస్థిరతకే ప్రమాదంగా మారిన రష్యా సైనిక చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్న యురోపియన్‌ యూనియన్‌ ఆంక్షలపై డ్రాఫ్ట్‌ సిద్దం చేసింది. త్వరలోనే ఆమోదించనుంది. అంతకంటే ముందే జర్మనీ తన గ్యాస్‌ ప్రాజెక్టును రద్దు చేసుకుంది. యూరోప్‌ దేశాలకు ఉండే ప్రయార్టీ వీసాలు రద్దు చేశాయి. రష్యా ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా అతిపెద్ద బ్యాంకులపై నిషేధం విధించింది అమెరికా. 30 సభ్యదేశాల ప్రతినిధులతో సమావేశం అవుతున్న జె బైడెన్‌ కూడా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

ఆంక్షలు పెడితే తేల్చుకుంటాం..

అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలపై రష్యా భగ్గుమంది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తామని హెచ్చరించింది. స్పేస్ స్టేషన్‌ను యూరోప్‌ దేశాలు, అమెరికాపై కూల్చేస్తే మీకు ఓకేనా అని ప్రశ్నించారు రష్యా స్పేష్ ఏజెన్సీ చీఫ్‌ రొగొజిన్. ఆంక్షలతో కట్టడి చేయాలనుకుంటే ఫలితం ఇంకోలా ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చింది.

రష్యాపూ ఆంక్షల వివరాలు ఇలా..

  1. రష్యాపై మొదలైన ఆంక్షలు
  2. రష్యా బ్యాంకులపై US ఆంక్షలు
  3. విమాన సర్వీసులు బ్యాన్‌ చేసిన యూకే
  4. రష్యా పౌరులకు EU ప్రయార్టీ వీసాల రద్దు
  5. ఎగుమతి అనుమతులు రద్దు చేసిన కెనడా
  6. జర్మనీ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు రద్దు
  7. ఆంక్షల దారిలో ఆస్ట్రేలియా, జపాన్‌
  8. ఆంక్షలు విధించడంతో….
  9. EUకు నాచురల్‌ గ్యాస్‌ 38శాతం ఎగుమతి
  10. క్రూడ్‌ అయిల్‌ 26శాతం ఎగుమతి
  11. జర్మనీ పైప్‌లైన్‌-2 ఎఫెక్ట్‌
  12. యూరోప్‌ దేశాలకు గ్యాస్‌, క్రూడ్‌ సవాళ్లు

ఇవి కూడా చదవండి: Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..

Russia Ukraine War Live: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. యుద్ధం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి