Russia vs Ukraine: ఉక్రెయిన్‌లో సంబరాలు చేసుకుంటున్న జనాలు.. ఎందుకో తెలుసా..?

చాలా నెలల తరువాత ఉక్రెయిన్‌లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటున్నారు. దానికి కారణం.. రష్యా సైన్యం వెనక్కి తగ్గడమే.

Russia vs Ukraine: ఉక్రెయిన్‌లో సంబరాలు చేసుకుంటున్న జనాలు.. ఎందుకో తెలుసా..?
Ukraine

Updated on: Nov 12, 2022 | 9:58 PM

చాలా నెలల తరువాత ఉక్రెయిన్‌లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటున్నారు. దానికి కారణం.. రష్యా సైన్యం వెనక్కి తగ్గడమే. అయితే, ఖేర్సన్ నుంచి రష్యా సైన్యం వెనక్కి తగ్గడంలో ఉక్రెయిన్ సైన్యం పరాక్రమం ఉంది. తమ సైన్యం ఇప్పటికి 41 ప్రాంతాలను విముక్తం చేసిందని చెబుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. అవును, ఉక్రెయిన్‌లో రష్యాకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు.. నెలలు గడుస్తున్నా తాము ఆశించిన ఫలితం కనిపించకపోగా ఆక్రమిత ప్రాంతాల్లో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఉక్రెయిన్‌ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన మొదలు కావడంతో క్రమంగా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాజాగా కీలకవైన ఖేర్సన్‌ నగరాన్ని విడిచిపెట్టింది రష్యన్‌ ఆర్మీ.. నిప్రోనది పశ్చిమ తీరం నుంచి పూర్తిగా వెనక్కి తగ్గామని మాస్కో ప్రకటించింది. వెంటనే ఉక్రెయిన్‌ సైన్యం ఖేర్సన్‌లోకి ప్రవేశించింది.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు అతిపెద్ద విజయంగా చెబుతున్నారు.. రష్యన్‌ సైన్యం నగరాన్ని విడిచి వెల్లడంతో ఖేర్సన్‌ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అటు రాజధాని కీవ్‌ నగరంలో కూడా ప్రజలు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలు ఎగురేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. తమ సైన్యం ఇప్పటి వరకూ 41 ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఖేర్సన్‌ స్వాధీనంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఖేర్సన్‌లో రష్యన్‌ సైనికులు, పౌరులు ఎవరైనా ఉంటే లొంగిపోవాలని పిలుపునిచ్చింది ఉక్రెయిన్‌ ఆర్మీ.. నగరంలో రష్యన్స్‌ విడిచిపెట్టి వెళ్లి వస్తువులను అనుమానంతో తనిఖీ చేస్తున్నారు. వాటిలో ఏమైనా పేలుడు పదార్థాలు ఉంటే నిర్వీర్యం చేస్తున్నారు.. మరోవైపు రష్యన్‌ సైన్యం ఖేర్సన్‌ సమీపంలోని మైనోలైవ్‌ ప్రాంతంపై క్షిపణులతో విరుచుకుపడింది.. ఈ దాడుల్లో 7మంది మరణించారని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..