Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భీకర పోరు..సై అంటే సై..డీ అంటే ఢీ..ఎస్..ఉక్రెయిన్(Ukraine) మీద విరుచుకుపడుతోంది రష్యా(Russia). నాలుగో రోజు దాడి మరింత ఉధృతమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి రష్యన్ బలగాలు. ప్రెసిడెన్షియల్ బిల్డింగే(Presidential Building) టార్గెట్‌గా ముందుకెళ్తున్నాయి. గెరిల్లా సైన్యాన్ని దింపింది రష్యా. ఐతే రష్యన్ ఆర్మీని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. వీరోచితంగా పోరాడుతూ ఎక్కడికక్కడ రష్యన్ బలగాలను అడ్డుకుంటోంది. పౌరులు కూడా దైర్యంగా కదనరంగంలోకి దూకుతున్నారు. దీంతో కీవ్‌లో రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.
ఉక్రెయిన్‌లో భీకర పోరుతో ఇంటర్ నెట్ వ్యవస్థ స్తంభించిపోతోంది. ప్రధాన నగరాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండాపోతుందనే ఆందోళనలో ఉన్న ఉక్రెయిన్..స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌ను ఆశ్రయించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచానికి తెలిపేలా..తమ దేశానికి స్టార్ లింక్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలందించాలని విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం ట్వీట్‌కు స్పందించిన ఎలాన్ మస్క్.. ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ శాటిలైట్ సర్వీసులను యాక్టివేట్ చేసినట్టు తెలిపారు. మరిన్ని టెర్మినల్స్‌కు స్టార్ లింక్ శాటిలైట్ నుంచి ఇంటర్‌నెట్ సేవలు అందుతాయని హామీ ఇచ్చారు.
ఇక రాజధాని కీవ్‌లో ఐతే పరిస్థితి మరింత డేంజరస్‌గా ఉంది. ఎటు నుంచి బాంబులు, మిస్సైల్స్ మీద పడతాయోనని భయంభయంగా గడుపుతున్నారు. పౌరులెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని..బంకర్లలో సేఫ్‌గా ఉండాలని సైరన్లలో హెచ్చరిస్తున్నారు అధికారులు. కీవ్ నుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. అవును. ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులు..తమను త్వరగా స్వదేశానికి తీసుకెళ్లాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also…