Russia Ukraine War: రాజధాని కైవ్ ‘కమాండ్ సెంటర్’ను పేల్చేస్తాం.. ఉక్రెయిన్ సైన్యం కాల్పులతో రెచ్చిపోయిన రష్యా..

ఉక్రెయిన్‌పై అంతుచిక్కని వ్యూహంతో రష్యా ముందుకెళ్తోంది. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కిలా ఉంది రష్యా సైన్యం పరిస్థితి.

Russia Ukraine War: రాజధాని కైవ్ 'కమాండ్ సెంటర్'ను పేల్చేస్తాం.. ఉక్రెయిన్ సైన్యం కాల్పులతో రెచ్చిపోయిన రష్యా..
Ukraine Russia War
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 15, 2022 | 9:51 AM

ఉక్రెయిన్‌పై అంతుచిక్కని వ్యూహంతో రష్యా ముందుకెళ్తోంది. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కిలా ఉంది రష్యా సైన్యం పరిస్థితి.  రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో నేటికి 51వ రోజు. గత 50 రోజుల్లో, రష్యా ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని ప్రధాన నగరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ యుద్ధంలో ఏ రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. మరోవైపు సరిహద్దు వెంబడి ఉన్న తమ ప్రాంతాలపై ఉక్రెయిన్ కాల్పులు జరిపిందని రష్యా నిన్న ప్రకటించింది. ఆ దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్‌లోని కైవ్ నగరంలో “కమాండ్ సెంటర్”పై దాడి చేస్తామని రష్యా సైన్యం హెచ్చరించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ సాయంత్రం ఒక బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ.. “రష్యాలోని సౌకర్యాలపై దాడులు, విధ్వంసం చేయడానికి ఉక్రేనియన్ మిలిటరీ చేస్తున్న ప్రయత్నాలను మేము చూస్తున్నాము. రష్యా సైన్యం ఉన్న కైవ్‌లోని ‘కమాండ్ సెంటర్’పై దాడి చేస్తుంది. తాము ఎలాంటి ప్రతి దాడికి పాల్పడలేదని.. సంయమనం పాటిస్తున్నాం తెలిపింది రష్యా.

అసలు ఏం జరుగుతోంది..

వాస్తవానికి యుద్ధం మధ్యలో సరిహద్దుకు ఆనుకుని ఉన్న రష్యా ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ సైనిక చర్యలో ఓ గర్భిణి, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ చర్య దృష్ట్యా రష్యా సరిహద్దుకు ఆనుకుని ఉన్న రెండు గ్రామాలను ఖాళీ చేయించినట్లు గవర్నర్ తెలిపారు.

ఖార్కివ్‌లో 500 మందికి పైగా పౌరుల మృతి

51వ రోజు కూడా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడి తర్వాత ఖార్కివ్‌లో 24 మంది చిన్నారులతో సహా 500 మందికి పైగా పౌరులు చనిపోయారు. ఖార్కివ్ ఒబ్లాస్ట్ గవర్నర్ ఒలేహ్ సినెహుబోవ్ మాట్లాడుతూ.. రష్యా పౌర ప్రాంతాలపై షెల్లింగ్‌ను కొనసాగించిందని దీనివల్ల భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సినీహుబోవ్ ప్రకారం, ఏప్రిల్ 14న, రష్యా పౌర నివాసాలపై కనీసం 34 సార్లు దాడి చేసింది. రాకెట్ లాంచర్లు , ఫిరంగిదళాలను రంగంలోకి దింపింది. 

ఇవి కూడా చదవండి: Mobile Network: ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 4 చిట్కాలతో నెట్‌వర్క్ రెట్టింపు..

TTD: వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. మరో 3 రోజులు కొనసాగనున్న రద్దీ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!